Bheti Subhash Reddy : బీఆర్ ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. ఈటలకు పెరుగుతున్న భారీ మద్దతు

Qubetvnews - April 18, 2024 / 10:45 AM IST

Bheti Subhash Reddy : బీఆర్ ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. ఈటలకు పెరుగుతున్న భారీ మద్దతు

Bheti Subhash Reddy : బీఆర్ ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. ఎంత బుజ్జగించినా సరే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇది వరకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు.

ఇందులో ఆయన మరో విషయాన్ని కూడా వివరించారు. తాను ఈ లోక్‌ సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే బీజేపీలో చేరే విషయంపై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యమ సమయం నుంచి ఈటలకు సుభాష్‌రెడ్డి బాగా దగ్గరి మనిషిగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు బీఆర్ ఎస్ ను వీడారు. ఇప్పటికే చాలా మంది ఈటలకు మద్దతు పలుకుతున్నారు. ఒకప్పుడు ఈటల సపోర్టుతో ఎదిగిన వారంతా ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈటలను గెలిపించేందుకు ముందుకు వస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News