BRS propaganda weapon against Congress : బీఆర్ ఎస్ అస్త్రం అదే.. కాంగ్రెస్ మీద ప్రయోగిస్తుందా..?

Qubetvnews - March 2, 2024 / 08:53 AM IST

BRS propaganda weapon against Congress : బీఆర్ ఎస్ అస్త్రం అదే.. కాంగ్రెస్ మీద ప్రయోగిస్తుందా..?

BRS propaganda weapon against Congress : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏదో ఒక ప్రచార అస్త్రాన్ని ఎంచుకుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కొన్ని అస్త్రాలను ఎంచుకుంది. అయితే అందులో చాలా వరకు బెడిసికొట్టి ఆ అస్త్రాలు పని చేయకుండా పోయాయి. దాంతో అప్పటి నుంచి బీఆర్ ఎస్ వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి తిరిగి ప్రజల్లో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడం బీఆర్ ఎస్ కు అవసరం. ఎందుకంటే పదేండ్లు అధికారంలో ఉన్న తమకు.. ప్రజల్లో ఎంతో కొంత పట్టు ఉందని చెప్పుకోవడానికి ఇదే అవసరం. అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ ఈ ప్లాన్ వేస్తోంది.

కాగా ఎంపీ ఎన్నికల కోసం ఓ ప్రత్యేక అస్త్రాన్ని కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రయోగించేందుకు రెడీ అవుతోంది బీఆర్ ఎస్ పార్టీ. కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీలను ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయితే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇంకా పూర్తిగా అమలు చేయలేకపోతోంది. ఇప్పటి వరకు రెండు గ్యారెంటీలను మాత్రమే అమలు చేస్తోంది. ఇంకా నాలుగు గ్యారెంటీలను అమలు చేయట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం అంటే మాటలు కాదు.

దానికి చాలా బడ్జెట్ కావాలి. వంద రోజుల్లోనే అమలు చేయాలంటే దానికి సరిపోయేంత బడ్జెట్ తెలంగాణ ఆర్థిక బడ్జెట్ కు సరిపోతుంది. అంత మొత్తం ఆరు గ్యారెంటీలకే పెట్టాలంటే కుదరదు. పరిపాలన వీలు కాదు. కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా తయారయ్యాయి. దాంతో ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలను బీఆర్ ఎస్ పార్టీ అస్త్రంగా మలుచుకుంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీఆర్ ఎస్ బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధి విధానాలను రెడీ చేసుకుంది.

త్వరలోనే వాటిని ప్రజల్లో బలంగా ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది బీఆర్ ఎస్ ప్రభుత్వం. ఎంపీ ఎన్నికల్లోపు కాంగ్రెస్ ఇచ్చిన వంద రోజులు గడువు పూర్తి అవుతుంది. కాబట్టి ఆలోగా కాంగ్రెస్ అమలు చేయలేకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ విషయాన్ని ఎంపీ ఎన్నికల్లో బలంగా ప్రచారం చేయాలని రెడీ అయింది బీఆర్ ఎస్.

త్వరలోనే నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ ఇన్ చార్జుల ఆధ్వర్యంలో గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ ఫేక్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది బీఆర్ ఎస్ పార్టీ. ఈ ప్రచార ఆయుధం ఎంతో కొంత కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News