Kavitha : కవిత అరెస్ట్ బీఆర్ ఎస్ కు ఒక అస్త్రమే..?

Qubetvnews - March 18, 2024 / 11:47 AM IST

Kavitha : కవిత అరెస్ట్ బీఆర్ ఎస్ కు ఒక అస్త్రమే..?

Kavitha : మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఒక్క రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు చెందిన కీలక లీడర్లు ఇప్పుడు ఇందులో ఇరుక్కుంటున్నారు. అయితే కవిత అరెస్ట్ పై చాలా కాలంగా సస్పెన్స్ నెలకొంది. కానీ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దాంతో ఇప్పుడు ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ఇప్పుడు చెక్ పెట్టే అవకాశం దొరికింది.

వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అని. బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీమ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ ఎస్ కూడా తిప్పి కొట్టలేకపోయిందనే చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కూడా బీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టాయనే చెప్పుకోవాలి. బీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ కూడా సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఆ విమర్శలకు, ఆరోపణలకు చెక్ పెట్టే అవకాశం బీఆర్ ఎస్ కు దొరికింది.

ఇప్పుడు ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ అవకాశాన్ని బీఆర్ ఎస్ సరిగ్గా వాడుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని.. అసలు బీజేపీకి, బీఆర్ ఎస్ కు సంబంధం లేదని చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం అంటూ బీఆర్ ఎస్ ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి అవకాశాలు దొరికాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని బీఆర్ ఎస్ చెప్పుకోవచ్చు. అంతే కాకుండా కవిత అరెస్ట్ ను సింపతీ కోసం వాడుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టే.. తమను ఇలా బీజేపీ టార్గెట్ చేస్తోందని చెప్పుకోవచ్చు బీఆర్ ఎస్ నేతలు. ఇది ఎంపీ ఎన్నికల్లో ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల సానుకూలత ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గనక ఈ సింపతీని, బీజేపీ వ్యతిరేక విధానాన్ని సరిగ్గా వాడుకుంటే సరిపోతుంది.

ఈ ఎంపీ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించడానికి ఇది పెద్ద ప్రచార అస్త్రంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే విషయంలో విమర్శలు చేస్తోంది. కాబట్టి కవిత అరెస్ట్ ను ఇప్పుడు బీఆర్ ఎస్ సరిగ్గా వాడుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News