Revanth reddy : రేవంత్ కు వ్యతిరేకులంతా మద్దుతుదారులయ్యారా.. కోమటిరెడ్డి కామెంట్స్ అర్థం అదే..!
Qubetvnews - April 12, 2024 / 09:01 AM IST
Revanth reddy : రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది వ్యతిరేకించారు. ఇక రేవంత్ రెడ్డి తనను తాను నిరూపించుకుంటూ పోరాడటంతో ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొన్న పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎంత మంది సీనియర్లు ఆయనను తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా రేవంత్ ను వ్యతిరేకించారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.
రేవంత్ ఉంటే తాము పని చేయలేమని కొందరు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. ఇంత మంది కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా సరే.. రేవంత్ మాత్రం తన పని చేయడం ఎన్నడూ ఆపలేదు. రేవంత్ అలుపెరగని పోరాటంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత ఆయన్ను మొన్నటి వరకు వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు రేవంత్ కు మద్దతుదారులుగా మారిపోయారని తెలుస్తోంది. మొన్నటి వరకు రేవంత్ ను తిట్టిన వారే ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మరీ ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం నేతలు రేవంత్ ను ఎంతగా వ్యతిరేకించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ లో కీలకంగా ఉండే వారు అంటే ఖమ్మం, నల్గొండ నేతలే. అలాంటిది ఆ రెండు జిల్లాల నేతలు ఇప్పుడు రేవంత్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అందులోనూ కీలక నేతలు అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్యం రేవంత్ ను పొగుడుతూ వస్తున్నారు. ఇక కోమటిరెడ్డి అయితే రేవంత్ కాలిగోటికి కూడా కేసీఆర్ సరిపోడు అంటూ కీర్తిస్తున్నాడు. ఇక తాజాగా వెంకట్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేశారు. రేవంత్ పదేండ్లు సీఎంగా ఉంటారని చెప్పాడు.
వాస్తవానికి ఈ సారి రేవంత్ సీఎం అయ్యాడు కాబట్టి మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం అవ్వాలని కోరుకుంటాడని అనుకున్నారు. కానీ కోమటిరెడ్డి మాత్రం రేవంతే మరోసారి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే రేవంత్ మేనియా ఇప్పుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్న వారంతా ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు అంటే.. రేవంత్ రెడ్డికి ఇక కాంగ్రస్ లో తిరుగు లేదని అర్థం అవుతోంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక రాబోయే కాలంలో మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయనే చెప్పుకోవాలని అంటున్నారు.





