Etela Rajender : ఈటెలను గెలిపించి కేంద్ర మంత్రిని చేసుకుందాం

Qubetvnews - May 12, 2024 / 09:50 AM IST

Etela Rajender : ఈటెలను గెలిపించి కేంద్ర మంత్రిని చేసుకుందాం

Etela Rajender :

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి బీజేపీకి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రధాని అయితేనే దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని, మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ ఈటెల ధీమా వ్యక్తం చేశారు. చివరి రోజు ఈటెలకు మద్దతుగా పలువురు ప్రచారం చేశారు. బీజేపీ విజయంతో దేశంలోని అన్ని వర్గాల అభివృద్ది సాధ్యం అంటూ ప్రజలకు నాయకత్వం పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల మాట్లాడుతూ… కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల డబ్బు సంచులతో మేము పోటీ పడలేం, కానీ ప్రజలకు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో మాత్రం మేము అందరి కంటే ముందు ఉంటాం అంటూ హామీ ఇస్తున్నాను. పీఎం మత్స్య సంపద యోజనను మరింత విస్తరించడం ద్వారా చేపల ఉత్పత్తిని మరియు వార్షిక మత్స్య ఎగుమతులను పెంచడమే కాకుండా ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు బీమా కల్పించి వారికి సాధికారత కల్పించడం మన మోదీ గ్యారంటీ అన్నారు.

ఈటెలకు మద్దతుగా సినీ నటి, బీజేపీ నేత జీవిత రాజశేఖర్‌ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈటెల రాజేందరన్నను గెలిపించి కేంద్రమంత్రిని చేసుకుందాము. మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలో ఉన్న ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించారు. గత ఎన్నికల సమయంలో ఆయన నియోజకవర్గంలో తాను ప్రచారానికి వెళ్లానని, ఆ ఊర్లల్లో ఆయన్ని దేవుడిగా చూస్తున్నారని, కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే ఆయన ప్రజలను కాపాడుకున్నాడని, ఆయనతో పాటు ఆయన సతీమణి జమున కూడా ప్రజల కష్టాల గురించి తెలుసుకొని సహాయం చేసేవారని, ఈ విషయాలు తాను స్వయంగా చూశానని తెలిపారు.

ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి కనుక ఈటెల రాజేందర్‌ గారికి ఓటు వేయడం ద్వారా అభివృద్ది జరుగుతుంది. ఆయన ఎంపీగా గెలావాల్సిన వ్యక్తి, ఈ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీకి వెళితే తెలంగాణ ఎలా అభివృద్ధి అవుతుందో తాను చెప్పాల్సిన అవసరం లేదని, నిజాతీగా పని చేసే వ్యక్తి మనకు చాలా అవసరమని కొనియాడారు. మల్కాజ్‌గిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఆయన ఎంపీగా గెలిస్తే, కేంద్రమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనల్ని కాపాడి, తెలంగాణను నంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేయడం విడ్డూరం అని, కేంద్రం నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు గత పడేళ్లలో వచ్చాయి. ఆ విషయం తెలియని కాంగ్రెస్ మూర్ఖులు గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారు. వారి గుర్తును మరచి పోయి వారి కార్యకర్తలు కూడా గాడిద గుడ్డు కోసం ఈవీఎం లలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ను కాంగ్రెస్ పాలన నుంచి కాపాడాలి అంటే ప్రతి ఒక్కరు కమలం పువ్వుకు ఓటు వేయాలి, ప్రధానిగా నరేంద్ర మోడీని మళ్లీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో రాని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఆ ఓటు వృదా అవ్వడం తప్ప మరేం లేదు. బీఆర్‌ఎస్ కు కనీసం డిపాజిట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను పూర్తిగా మరచి పోవడం ఉత్తమం అన్నట్లుగా బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News