KCR : మాట, తీరు మారింది.. కేసీఆర్ లో ఈ మార్పు గమనించారా…?

Qubetvnews - April 15, 2024 / 09:55 AM IST

KCR : మాట, తీరు మారింది.. కేసీఆర్ లో ఈ మార్పు గమనించారా…?

KCR : కేసీఆర్ అంటే మాస్ లీడర్. ఒక్కో పంచ్ డైలాగ్ వెనక కొండంత ఆత్మస్థైర్యం కనిపించేది. ఆయన మైక్అందుకుంటే ప్రతిపక్షాలను ఏకి పారేసేవారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అన్న రేంజ్ లో ఆయన మాటలు ఉండేవి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకో మారిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు అంటే గత పదేండ్లుగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవారు. తెలంగాణకు బీఆర్ ఎస్ శ్రీరామ రక్ష అని చెప్పేవారు. తాను తప్ప తెలంగాణను ఎవరూ డెవలప్ చేయలేరన్న రేంజ్ లో మాట్లాడేవారు కేసీఆర్.

అయితే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఎందుకో తీరు మార్చినట్టు కనిపిస్తోంది. ఆయన మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకో అంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీ నుంచి వరుసగా పార్టీల నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. దాంతో ఆయనలో మానసిక ధైర్యం తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గాఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోంది. ఒకప్పుడు తెలంగాణను బీఆర్ ఎస్ మాత్రమే కాపాడుతుంది అన్న కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారు.

బీఆర్ ఎస్ పార్టీని ప్రజలే కాపాడాలని కోరుతున్నారు. ఆయన మాటల్లో వేడి తగ్గింది. గర్వం ఏ మాత్రం కనిపించట్లేదు. తాను తెలంగాణ తెచ్చిన వ్యక్తిని కాబట్టి.. తెలంగాణ కోసం ఆరాటపడే తత్వం ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడు అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలతో పాటు సెకండ్ గ్రేడ్ నాయకులను కూడా కలుస్తున్నారు. ఫోన్లు చేసి వారితో మాట్లాడుతున్నారు. తన మీద పార్టీలో ముందుగా వ్యతిరేకతను తగ్గించుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అందుకే ఇప్పుడు పార్టీలో అందరికీ అపాయింట్ మెంట్లు ఇస్తున్నారు. అంతే కాకుండా అటు ప్రజలను కూడా కలుస్తున్నారు. ఎండలో తిరుగుతూ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. గతంలో ఎన్నడూ కేసీఆర్ పెద్దగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి అందరినీ కలుస్తున్నారు.

ప్రజల తరఫున కొట్లాడుతానంటూ చెబుతున్నారు. ప్రజలను అండగా ఉంటానని చెబుతున్నారు. అయితే ఓడిపోతే కేసీఆర్ లో ఇంత మార్పు వస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. దేనికోసం మారినా సరే కేసీఆర్ లో ఇలాంటి మార్పు కోసమే పార్టీ శ్రేణులు ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఇది మంచిదే అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News