KCR : ఆ విషయంలో కేసీఆర్ యూ టర్న్.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రచార అస్త్రమే..!
Qubetvnews - April 9, 2024 / 09:27 AM IST
KCR : కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాని వెనకాల పెద్ద అర్థమే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ గతంలో టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చుకున్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచనతో ఆయన ఓ ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆయన పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు లాంటి లోకల్ పార్టీల లీడర్లతో భేటీ అయ్యారు. వారితో కలిసి పని చేయాలని అనుకున్నాడు.
కానీ అప్పట్లో అది ముందు పడలేదు. ఈ క్రమంలోనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అయిపోయారు. రాజకీయ పరంగా ఆయనకు ఇది చాలా మైనస్. ఎందుకంటే మూడోసారి గెలిస్తే మాత్రం దేశ రాజకీయాల్లో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించేవారు. కానీ ఆయనకు బ్రేక్ పడింది. దాంతో ఇప్పుడు రాజకీయ పరంగా బీఆర్ ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. దేశ రాజకీయాలు దేవుడెరుగు.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ ఎస్ నుంచి కీలక లీడర్లు అందరూ వెళ్లిపోతున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోతారనే టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే అసలు బీఆర్ ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. బీఆర్ ఎస్ పేరుతో ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నామని కేసీఆర్ పునరాలోచిస్తున్నారు. తనకు కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ పేరును కూడా మార్చాలని భావిస్తుననారంట. బీఆర్ ఎస్ నుంచి టీఆర్ ఎస్ గా మార్చాలని అనుకుంటున్నారు కేసీఆర్. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారంట. అయితే కేసీఆర్ గనక పునరాలోచన చేసి బీఆర్ ఎస్ ను టీఆర్ ఎస్ గా మారిస్తే మాత్రం కేసీఆర్ ను దేశరాజకీయాల్లో ఎవరూ పట్టించుకోలేదనే వాదనను కాంగ్రెస్, బీజేపీలు తెరమీదకు తెస్తాయి.
కేసీఆర్ ఏదో దేశ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తా అని బిల్డప్ లు కొట్టాడు గానీ.. అక్కడ బొక్క బోర్లా పడి చివరకు మళ్లీ టీఆర్ ఎస్ మార్చుకున్నాడంటూ విమర్శలు గుప్పిస్తాయి. అలా చేస్తే కేసీఆర్ కు మరింత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పని అని చెప్పుకోవాలి. ఇది కేసీఆర్ కు రాజకీయంగా మైలేజ్ ను తగ్గిస్తుంది.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కు ఇక ముందు కూడా ఎలాంటి ఇమేజ్ ఉండదనే చెప్పుకోవాలి. అన్నింటికన్నా.. ఇప్పుడు పార్టీ ఇమేజ్ తగ్గుతుందనే వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ ఎస్ ను టీఆర్ ఎస్ గా మారిస్తే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రచార అస్త్రం ఇచ్చినట్టే అవుతుంది.





