KCR : ఆ వర్గం ఓట్లను కాపాడుకునే దిశగా కేసీఆర్..?

Qubetvnews - April 3, 2024 / 09:55 AM IST

KCR : ఆ వర్గం ఓట్లను కాపాడుకునే దిశగా కేసీఆర్..?

KCR : బీఆర్ ఎస్ పదేండ్లు పరిపాలించింది. కానీ ఇప్పుడు ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీ మీద వస్తున్న నిందలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరుసగా కేసులు ఆ పార్టీ లీడర్లను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ కుట్ర పూరితంగా చేస్తున్నాయని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ ఎస్ ఓడిపోగానే అటు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడంతో పార్టీ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. అంతే కాకుండా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అటు భూ కబ్జా కేసులు ఇవన్నీ బీఆర్ ఎస్ ను నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పుకోవాలి.

కాగా వరుసగా బీర్ ఎస్ నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు పార్టీ గ్రాఫ్ ను పెంచుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరిణామాల మధ్య బీఆర్ ఎస్ కు అండగా ఉంటున్న రైతుల ఓట్లను చేజార్చుకోవద్దని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్తున్నారు. ఆ మధ్య నల్గొండలో భారీ బహిరంగ సభను పెట్టడానికి కారణం కూడా అదే. దాంతో ఇప్పుడు కరీంనగర్ బాట పడుతోంది కూడా రైతుల మద్దతు కూడగట్టేందుకు అని తెలుస్తోంది.

ఎందుకంటే వచ్చే నెలలో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ లోగానే కేసీఆర్ రైతుల మద్దతును మళ్లీ కూడగట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తాను మౌనంగా ఉంటే ఆ రైతుల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లుతాయని కేసీఆర్ ఊహించారు కాబోలు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే ముందు రైతుల వద్దకు వెళ్తున్నారు. త్వరలోనే రైతులను కలుపుకుని పోయి వారికి నష్టపరిహారం ఇచ్చేలా పోరాటాలు కూడాచేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు పండించిన పంటకు రూ.500 బోనస్ మీద నిన్న కలెక్టర్లకు బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇప్పించారు కేసీఆర్.

ఇలా రైతులకు, వారి పంట పొలాలకు సంబంధించిన విషయాల్లో కేసీఆర్ పోరాటాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో రైతుల ఓట్లే అత్యధికంగా ఉంటాయి. ఇన్ని రోజులు బీఆర్ ఎస్ కు అండగా ఉన్నది కూడా అదే రైతులు. అందుకే రైతుల కోసమే గతంలో కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు.

ఇప్పుడు మళ్లీ అదే రైతుల కోసం పోరాటాలు చేసి మళ్లీ ఆ వర్గం ఓట్లను చేజారకుండా చూసుకోవాలని రేవంత్ ప్లాన్ వేస్తున్నారు. మొత్తంగా ఆయన వేసిన ఎత్తుగడ వర్కౌట్ అవుతుందని బీఆర్ ఎస్ నేతలు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News