KCR : వింటేజ్ కేసీఆర్ ఈజ్ బ్యాక్.. బీఆర్ఎస్ లో ఫుల్ జోష్..!
Qubetvnews - February 17, 2024 / 07:18 AM IST
KCR :
కేసీఆర్ స్పీచ్ అంటే పవర్ ఫుల్ పంచ్ లు.. దద్దరిల్లే వార్నింగ్ లు.. ప్రాసలు.. అదిరిపోయే డైలాగులు.. సామెతలు.. ఇలా వినడానికి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఏ విషయాన్ని అయినా కేసీఆర్ సామాన్య జనాలకు అర్థమయ్యాలే మాట్లాడగలరు. అంతే కాకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంతో ఆయన స్టైలే వేరు. పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తుంటారు కాబట్టే.. ఆయన వాగ్ధాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఈ నడుమ కనిపించట్లేదని చాలా మంది నిరాశ పడ్డారు. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ సభలు కాస్త చప్పగానే సాగాయని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అనుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్.. ఓటమి నుంచి తేరుకుని జనాల్లోకి వచ్చేశారు. వస్తూనే ఛలో నల్గొండ అంటూ హోరెత్తించారు. మొన్నటి వరకు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటికే పరిమితం అయిన ఆయన.. ఇప్పుడు కోలుకుని కాంగ్రెస్ మీద పోరుబాటకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా కృష్నా ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండలో సభ పెట్టేశారు. అయితే ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన మైక్ పట్టుకున్నారు. దాంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు.
కేసీఆర్ ఎక్కడా కూడా నిరాశ పరచలేదు. రెంట్టింపు ఉత్సాహంతో ఉరకలెత్తు పంచ్ డైలాగులతో అదరగొట్టేశాడు. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఎలా అయితే పంచ్ డైలాగులతో దుమ్ము లేపేవాడే.. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనేలా ఆయన స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. ఓటమితో ఆయన కుదేలైపోయాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదని నిన్నటి స్పీచ్ చూస్తేనే అర్థం అవుతోంది. ఆ రేంజ్ లో ఆయన ఆకట్టుకున్నారు.

KCR Warned Congress Leaders
ఇక కాంగ్రెస్ నేతలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ లు ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. దీంతో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సంచలనం రేపుతున్నాయి. అవి చూసిన వారందరూ వింటేజ్ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత కేసీఆర్ స్పీచ్ కు ఇంతటి ఆదరణ దక్కిందని బీఆర్ ఎస్ కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. కేసీఆర్ ఇలాగే ముందుకు సాగితే ప్రజల్లో తిరిగి బీఆర్ఎస్ మీద పాజిటివ్ నెస్ పెరిగిపోవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేస్తున్నారు. ఏదేమైనా వింటేజ్ కేసీఆర్ తిరిగి రావడంతో బీఆర్ ఎస్ లో ఫుల్ జోష్ నిండిపోయింది.



