Ktr challenge to revanth : రేవంత్ కు కేటీఆర్ సవాల్.. గురిచూసి కొట్టాడా..?

Qubetvnews - March 1, 2024 / 12:18 PM IST

Ktr challenge to revanth : రేవంత్ కు కేటీఆర్ సవాల్.. గురిచూసి కొట్టాడా..?

Ktr challenge to revanth : ఇప్పుడు తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు నువ్వా నేనా అన్నట్టు సవాళ్ల పర్వం సాగుతోంది. కేటీఆర్, రేవంత్ పదే పదే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతే తప్ప ఎవరూ తగ్గట్లేదు. కేటీఆర్ తన మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నాడని మొన్నటి సభలో రేవంత్ ఓ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎన్నికలకు ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ కు మూడు సీట్లు వచ్చేవి కావని కేటీఆర్ అంటున్నాడు.. నేను ఆయనకు సవాల్ విసురుతున్నా.. ఇప్పుడు ముఖ్యమంత్రిని నేనే.. టీపీసీసీ చీఫ్ ను కూడా నేనే.

ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో దమ్ముంటే కేటీఆర్ ఒక్క సీటు అయినా తెచ్చుకో అంటూ సవాల్ విసిరారు. అయితే దానికి కేటీఆర్ కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలోనే ఇద్దరం పోటీ చేద్దాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా.. ఇద్దరం మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేద్దాం.. నా మీద గెలిచి చూపించు అని సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ కు దమ్ముంటే సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది.. బీఆర్ ఎస్ ఎన్ని గెలిచిందో చూసుకోవాలని.. అలాగే కార్పొరేటర్లు ఎంత మంది గెలిచారో కూడా చూసుకుంటే.. అసలు విజయం ఎవరిదో అర్థం అవుతుందని చెప్పారు కేటీఆర్. కాగా కేటీఆర్ చేసిన సవాల్ ఆయనకు చాలా అనుకూలంగా ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు కేటీఆర్ సవాల్ ను రేవంత్ ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ పదవులకు రాజీనామా చేయలేడు.

ఒకవేళ చేద్దాం అని ఆలోచించినా.. మల్కాజిగిరిలో ఇప్పుడు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ సవాల్ ను స్వీకరించే ధైర్యం రేవంత్ రెడ్డి చేయలేరనేది అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు కేటీఆర్ ఇలా గురిచూసి సవాల్ విసిరాడని అంటున్నారు.

మొత్తానికి సవాళ్ల పర్వంలో కేటీఆర్ ఒకింత పైచేయి సాధించాడని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి కేటీఆర్ సవాల్ కు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ సవాల్ కు స్పందించిన కేటీఆర్.. ఇంకా పెద్ద సవాల్ నే విసిరారు. మరి రేవంత్ ఏమంటారో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News