KTR : ఇమేజ్ ను కాపాడుకునే పనిలో కేటీఆర్.. ముందు జాగ్రత్తతోనేనా..?
Qubetvnews - April 4, 2024 / 09:39 AM IST
KTR : కేటీఆర్ అంటే బీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి పాపులర్ లీడర్. తండ్రికి తగ్గ కొడుకుగా రాజకీయాలు చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అలాంటిది కేటీఆర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ మీద ఎన్ని విమర్శలు చేశారో మనం చూశాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కేటీఆర్ మీద ఆయన చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద సంచలనమే రేపాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన మార్క్ రాజకీయాలను అమలు చేసే పనిలో పడ్డారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చినట్టు రేవంత్ రెచ్చిపోతున్నారు. కేటీఆర్ మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరికించే పనులు ముమ్మరంగా నడుస్తున్నాయని అంటున్నారు. కేటీఆర్ మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అటు రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ.. హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేసి వారిని బెదిరించాడని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా కొందరు స్టార్ సెలబ్రిటీ కపుల్స్ మాట్లాడుకుంటేకూడా విన్నాడని అంటున్నారు.
దాంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని ఆయన గ్రహించారు. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు కేటీఆర్. తన మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రెడీ అయిపోయారు. వెంటనే తన మీద ఎవరెవరు అయితే ఆరోపణలు చేస్తున్నారో వారి మీద కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. అంతేకాకుండా వారికి లీగల్ నోటీసులు కూడా పంపిస్తున్నారు కేటీఆర్. దాంతో పాటు ఆయనే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కౌంటర్లు కూడా వేస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ సవాల్ విసురుతున్నారు.
ఈ విషయంలో తన ఇమేజ్ ను కాపాడుకునేందుకు కేటీఆర్ అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు. కేటీఆర్ ఇన్ని రోజులు క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్అయిందేమో గానీ.. కేటీఆర్ మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆయన మీద మంచి ఇమేజ్ ఉంది బీఆర్ ఎస్ లో.
అటు ప్రజల్లో కూడా బాగానే పేరుంది. కాబట్టి ఇప్పుడు తన ఇమేజ్ డ్యామేజ్ అవకుండా కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. త్వరలోనే ఈ విషయాలపై కచ్చితంగా న్యాయ పోరాటం చేసేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.
