Operation Chanakya Survey : ఆపరేషన్ చాణక్య సర్వే.. ఏపీ, తెలంగాణ అటు కేంద్రంలో ఎవరికి ఎన్ని సీట్లంటే..!

Qubetvnews - April 16, 2024 / 08:06 PM IST

Operation Chanakya Survey : ఆపరేషన్ చాణక్య సర్వే.. ఏపీ, తెలంగాణ అటు కేంద్రంలో ఎవరికి ఎన్ని సీట్లంటే..!

Operation Chanakya Survey : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాంతో అందరి చూపు ఇప్పుడు ఏపీ మీద ఉంది. ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ ఉంది. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీలోకి వచ్చింది. అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తుందా లేకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందా అని ఇలా అన్నివిధాలుగా ఇప్పటికే సర్వేలు వస్తున్నాయి.

తాజాగా ఆపరేషన్ చాణక్య సర్వే ఫలితాలను వెల్లడించింది. కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణలో కూడా సర్వేలను వెల్లడించింది. ముందుగా ఏపీలో చూసుకుంటే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం అని తేల్చి చెప్పేసింది. వైసీపీకి 108 నుంచి 107
సీట్లు వస్తాయని.. టీడీపీ కూటమికి 55 నుంచి 60 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 8 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని ఈ సర్వే వెల్లడించింది. కూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికారం దక్కదని నిగ్గు తేల్చింది ఈ సర్వే. అంతే కాకుండా అటు ఎంపీ ఎన్నికల్లో కూడా వైసీపీదే హవా అని తేల్చింది.

వైసీపీకి 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. టీడీపీ కూటమి 8 సీట్లు, ఇతరులు ఒక్క సీటు గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక బీజేపీ 7 సీట్లు సాధిస్తుందని స్పష్టం చేసింది సర్వే. ఇక ఎన్నో ఆశలుపెట్టుకున్న బీఆర్ ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చింది ఈసర్వే. ఎందుకంటే బీఆర్ ఎస్ కు ఒకే ఒక్క ఎంపీ సీటు మాత్రమే వస్తుందని సర్వే చెబుతోంది. అటు ఎంఐఎం తమ ఒక్క సీటును గెలుచుకుంటుందని చెబుతోంది సర్వే. అటు కేంద్రం విషయానికి వస్తే మళ్ల నరేంద్రమోడీ హవానే సాగుతోందని సర్వే చెబుతోంది.

కేంద్రంలో ఈ సారి బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందని అంటోంది. బీజేపీకి సొంతంగానే 342 నుంచి 353 సీట్లు వస్తాయని అటు ఇండియా కూటమికి మాత్రం కేవలం 95నుంచి 112 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఎన్డీయే కూటమికి మాత్రం 72 నుంచి 78 సీట్లు వస్తాయని అంటున్నారు.

మొత్తంగా కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. అయితే ఈసీ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వలేదని.. పోలింగ్ అయిపోయిన తర్వాత పూర్తి ఫలితాలను వెల్లడిస్తామని ఈ సర్వే చెబుతోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News