Revanth Reddy : చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్.. ఇరువురు కలిసి పనిచేస్తారా..?

Qubetvnews - June 6, 2024 / 09:36 PM IST

Revanth Reddy : చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్.. ఇరువురు కలిసి పనిచేస్తారా..?

Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. మొన్నటి వరకు ఒక మిత్ర బృందం అధికారంలో ఉంటే.. ఇప్పుడు మరో మిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మొన్నటి వరకు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ప్రభుత్వాలు ఉన్నాయి. వీరిద్దరూ మొన్నటి వరకు చాలా స్నేహపూర్వకంగా మెదులుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితుడిగా పేరున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు సీఎంగా ఉన్నారు. అటు ఏపీలో కూడా సీన్ మారిపోయింది.

బంపర్ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో మిత్రం బృందం అధికారంలో ఉన్నట్టు అయిపోయింది. చంద్రబాబు గెలిస్తే తనకు లాభం ఉంటుందని మొదటి నుంచి రేవంత్ కూడా ఆశపడ్డారు. అందుకు తగ్గట్టే ఆయన రాజకీయ గురువు అయిన చంద్రబాబు విజయం సాధించారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ అభినందించారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తారేమో అని.

రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కొన్ని పంచాయితీలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు వాటిని వీరిద్దరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల నడుమ గొడవలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరిస్తే మాత్రం వారికి కచ్చితంగా తెలుగు ప్రజల్లో మంచి మార్కులు పడుతాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు చెబితే రేవంత్ రెడ్డి కూడా వింటాడనే టాక్ ఎలాగూ ఉంది. కాబట్టి ఈ విషయంలో పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది.

ఇక రాజకీయంగా కూడా ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని అంటున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా ఇన్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అందుకే రేవంత్ ఆ రుణాన్ని ఏదో ఒక రకంగా తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు.

కాంగ్రెస్ లో రేవంత్ కు పట్టు పెంచే విధంగా చంద్రబాబు సలహాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా చంద్రబాబు పాలనా అనుభవంతో రేవంత్ కు పాలన పట్ల కొన్ని సూచనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఇద్దరూ ఎలా ముందుకు వెళ్తారో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News