Revanth Reddy : మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తున్న రేవంత్.. కలిసొచ్చే అంశమే..!
Qubetvnews - July 17, 2024 / 03:01 PM IST
Revanth Reddy : ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏకస్వామ్య అధికారం అనేది అస్సలు మంచిది కాదు. అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతకు దారి తీస్తుంది. గతంలో జరిగింది ఇదే. కేసీఆర్ హయాంలో ఏ శాఖకు సంబంధించిన హామీ అయినా సరే కేటీఆర్ ఇచ్చేవారు. ఏ శాఖలో సమస్యలు వచ్చినా సరే ఆయన మాత్రమే ప్రకటనలు చేసేవారు. దాంతో అసలు మంత్రులు ఉన్నారా లేరా అనే అనుమానాలు కూడా వచ్చాయి ప్రజలకు. దాంతో అసలు మంత్రులు ఎందుకు ఉన్నారు అంటూ తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అంటే ఒక రకంగా పేరుకే మంత్రులు గానీ.. అధికారం వారి చేతుల్లో పెద్దగా ఉండేది కాదు.
అదే నియంతృత్వ ధోరణి అనే ప్రచారానికి తావు ఇచ్చింది. ఇక ఇప్పుడు రేవంత్ గతంలో బీఆర్ ఎస్ చేసిన తప్పులను బాగానే పసిగట్టి నట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన సీఎంగా చేయాల్సింది చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులకు శాఖల విషయంలో వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. దాంతో మంత్రులు తమ శాఖల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వారే పరిష్కరిస్తున్నారు. అంతే కాకుండా శాఖాపరమైన హామీలను కూడా వారే ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మీద పాజిటివిటీని తీసుకువస్తోంది. మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తే ఆ శాఖల్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
దాని వల్ల ప్రజలకు త్వరగా సమస్యలు పరిష్కారం అయి వారి దృష్టిలో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఒక శాఖతో సంబంధం ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు తమకు తామే ఆలోచించుకుని దానిపై పరిష్కార ప్రకటనలు చేస్తున్నారు. అదే ఇప్పుడు మంత్రుల మీద ప్రజల్లో ఒక పాజిటివ్ నెస్ పెంచుతోంది. దాంతో మంత్రులు కూడా ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్నారు. అది అంతిమంగా ప్రభుత్వం ఇమేజ్ ను గ్రాఫ్ ను పెంచుతుంది. ఈ విషయాన్ని రేవంత్ ముందే గ్రహించాడేమో అని అనిపిస్తోంది.
ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అని చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు మంత్రుల పనితీరు విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవాలి. ముందు ముందు కూడా ఇదే విధంగా సాగితే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతుందని అంటున్నారు.




