Revanth reddy : వారి కోసం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్‌.. పెద్ద ప్లానే వేశాడుగా..!

Qubetvnews - March 15, 2024 / 09:27 AM IST

Revanth reddy : వారి కోసం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్‌.. పెద్ద ప్లానే వేశాడుగా..!

Revanth reddy : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చే దిశగా సాగుతున్నాడు. పదేండ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఆయన సీఎం కూడా అయిపోయాడు. కాగా ఇప్పుడు ఆయన పార్టీ చీఫ్‌ గా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలను తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పునాదులు మరింత బలంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలానే రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. కాంగ్రెస్ బలంతోనే అధికారంలోకి వచ్చిందని వంద శాతం చెప్పలేము.

ఎందుకంటే తెలంగాణలో పదేండ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ ఎస్ మీద చాలా వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీఆర్ ఎస్ మీద ఉన్న కోపంతోనే చాలా మంది కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పునాదులు మరింత బలంగా మార్చాలని రేవంత్ భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏయే వర్గాలు అయితే కాంగ్రెస్ తో కలిసి ఉన్నాయో.. ఆ వర్గాలను, ఆ నేతలను మళ్లీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి.

గత పదేండ్లలో కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేతలను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలు పెట్టారంట. ఇదే విషయాన్ని రేవంత్ టీమ్ చెబుతోంది. కాంగ్రెస్ ను వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీలో చేరే వారికి కచ్చితమైన రాజకీయ హామీలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని హామీలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా కొందరికి ఇప్పుడు ఎంపీ టికెట్లు కూడా హామీ ఇస్తున్నారంట రేవంత్. ఇలా కాంగ్రెస్ కు దూరం అయిన ప్రతి వర్గాన్ని, ప్రతి నేతను కలుపుకుని పోవాలని డిసైడ్ అయ్యారంట రేవంత్ రెడ్డి.

ఇప్పటికే చాలా మంది రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు బీఆర్ ఎస్ తో పాటు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లను లాగేసే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా మందిని కలుస్తున్నారు. ఇప్పుడు జితేందర్ రెడ్డిని కూడా కలిశారు.

ఆయనకు ఎంపీ టికెట్ ను కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అటు బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ లీడర్లతో కూడా రేవంత్ మంతనాలు జరుపుతున్నారంట. ఇలా పాత వారిని మళ్లీ పార్టీలోకి తెస్తే మాత్రం పార్టీకి మరింత బలం పెరగడం ఖాయం అని అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News