Revanth Reddy : ఆ విషయంలో మార్కులు కొట్టేస్తున్న రేవంత్..!

Qubetvnews - March 25, 2024 / 09:42 AM IST

Revanth Reddy : ఆ విషయంలో మార్కులు కొట్టేస్తున్న రేవంత్..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విషయాన్ని బలంగా చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే కచ్చితమైన మార్పును తీసుకొచ్చి చూపిస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఆయన చాలానే హామీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతే ప్రజా వ్యతిరేకత వస్తుందని రేవంత్ కు బాగా తెలుసు. అందుకే ఆయన సీఎం అయిన వెంటనే ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టించారు. దాన్ని ప్రజా భవన్ గా మార్చేశారు. గతంలో కేసీఆర్ మీద ఓ బలమైన విమర్శ ఉండేది.

ఆయన ప్రజలను కలవరని.. కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరని.. దొరతనాన్ని చూపిస్తున్నారంటూ ఇలా చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు తన మీద రాకుండా.. చూసుకోవడాని రేవంత్ ప్రజావాణి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రజలను కలిసేందుకు ప్రతి వారంలో రెండు రోజులు కేటాయిస్తున్నారు. ఎవరు వచ్చినా సరేవారి సమస్యలను దగ్గరుండి మరీ వింటున్నారు. ఇలా చేయడం వల్ల తాను సామాన్య ప్రజల మనిషిని అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని రేవంత్ భావిస్తున్నారు.

ఇప్పుడు ప్రజలకు కూడా అదే విషయంలో రేవంత్ మీద సానుకూలత ఏర్పడుతోంది. అంతుకు ముందు కేసీఆర్ ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం ప్రతి ఒక్కరినీ దగ్గరకు రానిస్తున్నారు. అయితే మొన్నటి వరకు ప్రజాభవన్ లోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేవారు రేవంత్. కానీ ఇప్పుడు మాత్రం జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద కూడా ప్రజలను నేరుగా కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజలను నేరుగానే కలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా సామాన్యులను కలుస్తూ తాను పేదల మనిషిని అని చెప్పుకుంటున్నారు.

ఈ విషయంలో కేసీఆర్ కు తనకు ఉన్న తేడాను వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. మొన్న శనివారం ఆయన్ను కలిసేందుకు కొంతమంది ఆయన ఇంటికి వస్తే వారిని నేరుగా కలిసిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్టు చేశారు.

ఇందులో ఇలా రాసుకొచ్చారు. అందులో ఏముందంటే.. నేను చేరలేనంత దూరం కాదు.. దొరకనంత దుర్గం కాదు.. సామాన్యుల మనిషిని నేను అంటూ రాసుకొచ్చారు. ఈ కొటేషన్ బాగా ప్రజల్లోకి వెళ్లింది. ఇలా ప్రజలను కలుస్తూ తాను ప్రజల మనిషిని అనిపించుకోవడం రేవంత్ మార్కులు కొట్టేస్తున్నాడని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News