Revanth Reddy : బీఆర్ ఎస్ కు షాకులు.. కాంగ్రెస్ లోకి నేతలు.. రేవంత్ వ్యూహమే..!

Qubetvnews - March 31, 2024 / 09:36 AM IST

Revanth Reddy : బీఆర్ ఎస్ కు షాకులు.. కాంగ్రెస్ లోకి నేతలు.. రేవంత్ వ్యూహమే..!

Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ గ్రాఫ్‌ దారుణంగా పడిపోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీ క్రమక్రమంగా గ్రాఫ్‌ కోల్పోతుంది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి ఓ వ్యూహం రచించారు. ఒక పార్టీని దెబ్బ తీయాలంటే ప్రజల్లో ఆపార్టీ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి. ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న సానుకూలత దూరం కావాలి. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుంది. ఈ విషయంలో రేవంత్ ఓ బలమైన ప్లాన్ వేశారు. అదే మేడిగడ్డ బ్యారేజీని ప్రజల్లోకి తీసుకెళ్లడం. పిల్లర్లు కుంగిపోయాయనే విషయంపై చాలా పెద్ద చర్చ జరిగేలా చేశారు.

అది మొత్తం కాలేశ్వరం క్రెడిట్ ను పోగొట్టేసింది. బీఆర్ ఎస్ తిప్పికొట్టాలని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిది. బీఆర్ ఎస్ గత పదేండ్లలో గొప్పగా చెప్పుకునేది కాళేశ్వరం మాత్రమే. అలాంటి ప్రాజెక్టు క్రెడిట్ ను పోగొట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు బయటకు తీశారు. బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలామంది బీఆర్ ఎస్ లీడర్ల పేర్లు బయటకు వస్తాయనే టాక్ నడుస్తోంది. దాంతో పాటు అటు భూ కబ్జాల కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి.

ఇవన్నీ రేవంత్ వ్యూహంలో భాగంగానే తెరమీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ తప్పులను వెతికిమరీ బయటకు తీయడం వల్ల ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అప్పుడు ఈజీగా కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతాయనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇక్కడే రేవంత్ కు మరో అంశం కూడా కలిసి వచ్చింది. అందేంటంటే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. దాంతో ఆ విషయంలో బీఆర్ ఎస్ కు ఘోరమైన పరాభవం దక్కింది.

ఇది పార్టీ ఇమేజ్ ను అమాంతం నాశనంచేసింది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ ఎస్ నేతలు వెళ్లి కలుస్తున్నారు. కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతలు ఇప్పుడు రేవంత్ చెంతకు చేరుతున్నారు. రేవంత్ రెడ్డి త్వరలోనే తన వర్గాన్ని బలంగా మార్చుకుంటున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్న వారంతా కూడా రేవంత్ హామీ మీదనే వస్తున్నారు. పైగా వారంతా కూడా రేవంత్ వర్గంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ వర్గమే ఎక్కువ అవుతోంది. మొత్తానికి ఇలా రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News