Revanth Reddy : ఆ విషయంలో రేవంత్ నిరాశ.. బీజేపీని చూసి నేర్చుకోవాలంట..
Qubetvnews - July 19, 2024 / 11:33 AM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది. కానీ ఇంత వరకు ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంగతులు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మరి ఈ ఏడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంది. ఇక దేశమే ఆశ్చర్యపోయే విధంగా రుణమాఫీని ఏక కాలంలో చేసి తన మాట నిలుపుకున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒకేసారి రుణమాఫీ ఎన్నడూ చేయలేదు. విడతల వారీ చేస్తూ వచ్చింది. మరి అప్పుడు కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ కోసమే విడతల వారీగా చేస్తే.. ఇప్పుడు రేవంత్ ఏకంగా రూ.2లక్షల రుణమాఫీని ఏక కాలంలో ఎలా చేశారనేది అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది.
మరి ఇంత చేసినా సరే అది ప్రజల్లోకి మాత్రం ఎందుకు బలంగా వెళ్లలేకపోయాయనేది రేవంత్ భావన. ఆయన ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను కోరుకున్నట్టే అన్ని పనులను సక్సెస్ ఫుల్ గా చేస్తున్నా కూడా ఎందుకో అవి ప్రజల్లోకి బలంగా వెళ్లట్లేదంట. గతంలో కేసీఆర్ ఏం చేసినా సరే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను ఇంత చేస్తున్నా ఎందుకు ప్రచారం డల్ గా ఉంది అని ఆలోచిస్తున్నారంట. ఈ విషయంలో ఎలాగైనా టాప్ లోకి వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారంట.
ఇందులో భాగంగానే ప్రచారం చేయాల్సిందిగా కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కు ఆదేశాలు కూడా జారీ చేశారంట. రేవంత్ రెడ్డి ఇదే విషయంలో మోడీని చూపిస్తున్నారంట. మోడీ ప్రభుత్వం గత పదేండ్లలో కేంద్రంలో పెద్దగా చేసిందేమీ లేకపోయినా.. ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో చేస్తోందని.. కానీ మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామని అంటున్నారంట రేవంత్. వాళ్లు పెద్దగా చేయకపోయినా ప్రచారం చేసుకుంటుంటే.. మనం ఇంత చేసినా ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం.. ప్రజలు మనల్ని బలంగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని అడుగుతున్నారంట రేవంత్.
ఈ రోజుల్లో ఎవరి గురించి అవతలి వారు చెప్పరని.. మన ప్రచారం మనమే చేసుకంటే చాలా బెటర్ అని అంటున్నారంట రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఏం చేయాలో ఆలోచించాలంటూ తన టీమ్ కు చెబుతున్నారంట.

