Revanth Reddy : ఆ వర్గాన్ని ఒక్కటి చేస్తున్న రేవంత్.. ప్లాన్ అదిరిందిగా..!
Qubetvnews - March 30, 2024 / 10:24 AM IST
Revanth Reddy : రేవంత్ రెడ్డిని ఏ విషయంలోనూ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంత దూకుడుగా వ్యవహరించారో.. ఇప్పుడు అంత వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తనరాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో రేవంత్ వర్గం కాస్త తక్కువగానే ఉండేది. దాంతో ఆయనకు నిత్యం సీనియర్ల నుంచి ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీని అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ రేవంత్ కే దక్కింది.
దాంతో ఇప్పుడు కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. బీఆర్ ఎస్ నుంచే ఈ వలసలు పెరుగుతున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా రేవంత్ వర్గంగా ఉండేవారే ఎక్కువ వస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచి బీఆర్ ఎస్ లో చేరిన వారంతా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో వీరంతా రేవంత్ కు అత్యంత సన్నిహితులుగానే ఉన్నారు. దాంతో ఇప్పుడు వీరంతా మళ్లీ కాంగ్రెస్ బాట పట్టేందుకు ప్రధాన కారణం కూడా రేవంత్ రెడ్డి. ఆయన హామీ మేరకు వారు పార్టీలోకి వస్తున్నారు. ఇదే సమయంలో వారంతా రేవంత్ వెనకాలుండేందుకు ఇష్టపడే వస్తున్నారు.
బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న వారిలో ఎక్కువగా ఆర్థికంగా బలంగా ఉన్న వారే ఉంటున్నారు. అంతే కాకుండా వారు ఒకప్పుడు టీడీపీలో పెద్ద లీడర్లు. ఇప్పుడు తమ టీడీపీ సన్నిహితుడే ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి.. రేవంత్ కే వారు జై కొడుతున్నారు. దాంతో ఇప్పుడు రేవంత్ వర్గం చాలా బలంగా తయారవుతోంది. దాని వల్ల రేవంత్ కు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండనున్నాయని తెలుస్తోంది. రేవంత్ ఇప్పటి నుంచే తన వర్గాన్ని కాంగ్రెస్ లో బలంగా తయారు చేసుకుంటున్నారు.
దీని వెనకాల చాలా పెద్ద వ్యూహమే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి భవిష్యత్ లో మరోసారి సీఎం అవ్వాలని ప్లాన్ వేసుకుంటున్నారంట. అందుకే ఇప్పుడు తన వర్గాన్ని కాంగ్రెస్ లో అటు ప్రభుత్వంలో బలంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. దాని కోసం ఇప్పటి నుంచే ప్లాన్లేసుకుంటున్నారు.
ఇలా ఆయన ముందు చూపుతో వ్యవహరించడం చాలా మంచి విషయమే అంటున్నారు రాజకీయ నిపుణులు. అందుకే ఇప్పుడు ఇలాంటి ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.



