Brs : బీఆర్ ఎస్ టీఆర్ ఎస్ గా మారబోతుందా.. సంకేతాలు ఇవే..!
Qubetvnews - July 18, 2024 / 04:51 PM IST
Brs : తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ పేరు అప్పట్లో తెలంగాణ ఐక్యతను చాటి చెప్పింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటమే కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటంతో ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. దాంతో ఆ పార్టీ పేరు క్రమంగా ప్రజల్లో బలపడుతూ వచ్చింది. అందుకే ఆ పార్టీని అందరూ బాగా ఆదరించారు. అందుకే ఉద్యమ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చినా సరే ఈ పార్టీ అంత క్రేజ్ ను మాత్రం సంపాదించుకోలేకపోయాయి. ఈ పార్టీ పేరుతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సీఎంకూడా అయ్యారు.
రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మీదనే అధికారంలోకి వచ్చారు. అయితే అనేక రాజకీయ కారణాల దృష్ట్యా టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్ గా మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అలా చేయడం పార్టీకి ఏమీ కలిసి రాలేదు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూనే వచ్చింది. మొన్న ఎన్నికల్లో, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో లేకపోవడంతో పేగు బంధం తెగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దాంతో ఇప్పుడు పార్టీ పేరును మార్చేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.
తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగానే మార్చబోతున్నారంట. ఇందులో భాగంగానే మొన్న హరీష్ రావు కూడా బీఆర్ ఎస్ కండువా కాకుండా టీఆర్ ఎస్ అని రాసి ఉన్న కండువా వేసుకున్నారు. దాంతో పార్టీ పేరు మారబోతోందనే సంకేతాలు ఇవ్వడానికే ఆయన ఇలా వేసుకున్నారని అంటున్నారు.





