Botsa Jhansi Lakshmi : జగన్ రావాలి, విశాఖ అభివృద్ది కావాలి : బొత్స ఝాన్సీ
Qubetvnews - May 1, 2024 / 09:38 AM IST
Botsa Jhansi Lakshmi :
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఏపీ లో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే కచ్చితంగా వైకాపా గెలిచి వైఎస్ జగన్ సీఎం అవ్వాల్సిందే అంటూ ప్రజలకు బొత్స ఝాన్సీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీల పత్రంతో పాటు నమూనా బ్యాలెట్ ను బొత్స ఝాన్సీ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. రోజూ లాగే నియోజక వర్గంలోని పలు సామాజిక సేవా సంఘాలతో మరియు కుల సంఘాలతో బొత్స ఝాన్సీ ఆత్మీయ సమ్మేళన సభలు మరియు సమావేశాలు నిర్వహించి వైకాపా గెలుపు ఆవశ్యక్తను వివరించడం జరిగింది.
బొత్స ఝాన్సీ మాట్లాడుతూ… విశాఖకు పరిపాలనా రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది.. మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి. తీర ప్రాంతం మన బలం.. దానిని ఉపయోగించుకుంటూ ఏపీకి బలమైన భవిష్యత్తును నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. ఎంపీతో పాటు విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను గెలుచుకుంటాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన వైయస్ఆర్ కుటుంబం పట్ల చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుని మరింత పురోభివృద్ధి సాధించాలంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని,దానికి ఎన్ని కల్లో మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు. మక్కా నుంచి జంజం జలాలను విమానంలో అనుమతించాలంటూ తాను గతంలో పార్లమెంటులో ప్రస్తావించి అంశాన్ని గుర్తు చేశారు.
బ్యాలెట్ వరుస లోనూ నెంబర్ 1 గా నిలిచిన బొత్స ఝాన్సీ నమూన బ్యాలెట్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ పార్లమెంటు స్థానానికి వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ముప్పై ముగ్గురు ఎన్నికల బరిలో నిలవగా ఈ వి ఎం మెషిన్ లో నెంబర్ 1 సంఖ్యను ఝాన్సీ లక్ష్మి అభ్యర్థిత్వానికి ఫ్యాన్ గుర్తుగా కేటాయించారు. ఝాన్సీలక్ష్మిని అదృష్టానికి ప్రతీకగా ఉత్తరాంద్ర లో భావిస్తారు. బ్యాలెట్ బరిలో తొలి స్థానాన్ని దక్కించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు శుభ సంకేతంగా భావిస్తున్నారు. సూపర్ సిక్స్ కాదు…డక్కౌటే టిడిపి అంటూ బొత్స ఝాన్సీ ఫైర్. జగన్ నినాదాలతో దద్దరిల్లిన మధురవాడ వాంబే కాలనీ హోరెత్తిన సిద్దం నినాదాలు భీమిలి నియోజకవర్గంలో డా.బొత్స ఝాన్సీ, అవంతి శ్రీనివాస్ ప్రచారం.
ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి సి ఎంగా చేసే వరకు విశ్రమించవద్దని శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు . మధురవాడ వాంబే కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేసే వారికి బుద్ధి చెప్పాలన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే భీమిలి ప్రాంతం కీలక మవుతుందన్నారు. అది వాస్తవ రూపం దాల్చాలంటే జగన్ గెలవాలన్నారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజల ముందుకు వస్తున్న వారిని డక్కౌట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కొంగ జపంతో ప్రజలను మధ్య పెడుతున్నదని, గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.





