Chalamalasetty Sunil : ఏపీని సింగపూర్‌, జపాన్‌ లా డెవలప్ చేయడం సాధ్యమే : చలమలశెట్టి సునీల్‌

Qubetvnews - May 6, 2024 / 10:41 AM IST

Chalamalasetty Sunil : ఏపీని సింగపూర్‌, జపాన్‌ లా డెవలప్ చేయడం సాధ్యమే : చలమలశెట్టి సునీల్‌

Chalamalasetty Sunil :

కాకినాడ పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయం అంటూ ఇప్పటికే సర్వేల్లో వెళ్లడి అయ్యింది. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా చలమలశెట్టి సునీల్‌ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు అంటూ తేలిపోయింది. ఈ నేపథ్యంలో సునీల్‌ భారీ మెజార్టీ కోసం ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన కాకినాడ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాను ఎంపీగా గెలిస్తే కేంద్రం నుంచి ఏం తీసుకు వస్తాను, ఎలా నియోజకవర్గంను అభివృద్ది చేస్తాను అనే విషయాల గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం ను సాగిస్తున్నారు.

తాజాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న చలమలశెట్టి సునీల్‌ మాట్లాడుతూ… కాకినాడ తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తాను. ఇండియా తీర ప్రాంతంలో ఏపీలోనే 974 కిలో మీటర్లు ఉంది. ఇంత భారీ తీర ప్రాంతం ఉండటం అనేది ఏపీకి అదృష్టం. కేంద్ర ప్రభుత్వంను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా కాకినాడను సింగపూర్ మరియు జపాన్ ల స్థాయిలో అభివృద్ది చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కేంద్ర మంత్రులతో మరియు పార్లమెంట్‌ లో మాట్లాడి నేను కాకినాడ తీరాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు తీసుకు వస్తాను, ప్రాజెక్ట్‌ లను తీసుకు వస్తాను. నన్ను గెలిపించడం ద్వారా కాకినాడ ప్రజలు అభివృద్దిలో గతంలో ఎప్పుడు చూడని ఫలితాలను, ప్రతిఫలాలను చూపిస్తాను అంటూ హామీ ఇచ్చాడు.

Chalamalasetty Sunil Forward In Campaign For Huge Majority

Chalamalasetty Sunil Forward In Campaign For Huge Majority

గతంలో కాకినాడ లో పరిశ్రమల అభివృద్ది కోసం ప్రభుత్వం 10 వేల ఎకరాలను సేకరించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. కాకినాడ సెజ్ కోసం సేకరించిన భూములు వృధాగా పడి ఉన్నాయి. వాటన్నింటిని కూడా అభివృద్ది చేసి భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తాను అన్నారు. 15 ఏళ్లు దాటినా కూడా కాకినాడ సెజ్ లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేక పోవడం విడ్డూరం. తాను గెలిస్తే కాకినాడ సెజ్ లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను, కేంద్రంలోని ముఖ్య నాయకులతో మాట్లాడటంతో పాటు, పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతాను అంటూ సునీల్‌ హామీ ఇచ్చారు. వైకాపా కు ఓటు వేసి జగన్‌ ను మరోసారి సీఎంగా గెలిపించి, తనను పార్లమెంట్‌ కు పంపించాలని చలమలశెట్టి సునీల్‌ విజ్ఞప్తి చేశారు.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News