Chandrababu : పవన్ కు మళ్లీ షాక్ ఇచ్చిన చంద్రబాబు.. జనసేనానికి ఏంటీ పరిస్థితి..?

Qubetvnews - February 17, 2024 / 10:48 AM IST

Chandrababu : పవన్ కు మళ్లీ షాక్ ఇచ్చిన చంద్రబాబు.. జనసేనానికి ఏంటీ పరిస్థితి..?

Chandrababu :

పవన్ కల్యాణ్‌ కు షాకుల మీద షాకులిస్తున్నాడు చంద్రబాబు. అసలు తగ్గేలే అన్నట్టు రెచ్చిపోతున్నాడు. పవన్ కల్యాణ్‌ అసలు మొదట్లో గంపెడు ఆశలు పెంచుకున్నాడు. చంద్రబాబుకు తన అవసరం ఉంది కాబట్టి.. తన వద్దకు వస్తున్నాడని.. కాబట్టి రేపు తనకు భారీగా సీట్లు ఇస్తాడని.. అధికారంలో భాగస్వామ్యం ఇస్తాడని ఇలా గంపెడు ఆశలు పెంచుకున్నాడు. అందుకోసం బాబు జైల్లో ఉన్నప్పుడు ఎంత హంగామా చేశాడో చూశాం. రోడ్డుకు అడ్డంగా పడుకుని మరీ నిరసన తెలిపాడు పవన్ కల్యాణ్‌. కనీసం జనసేన కార్యకర్తలు, నేతల కోసం కూడా ఏనాడు అలా చేయలేదు.

పోనీ ఇంత చేస్తే బాబు బయటకు వచ్చాక ఏమైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు. చంద్రబాబు అసలు పవన్ ను లెక్క చేయట్లేదు. తాను ఎన్ని సీట్లు ఇస్తే అన్నీ మూసుకుని తీసుకోవాలి అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించుకున్నాడు. దాంతో పవన్ ఆగ్రహం తెలిపాడు. టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదని.. కాబట్టి తాను కూడా రెండు సీట్లు ప్రకటించుకుంటున్నా అని రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించుకున్నాడు. దాంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యాడు. పవన్ కల్యాణ్‌ తో చివరిసారిగా సీట్ల పంపకాలపై చర్చించాడు.

దాంతో ఇక నుంచి అయినా ఇద్దరూ ఎవరికి వారు సీట్ల ప్రకటనలు మానుకుంటారని అంతా అనుకున్నారు. కానీ తీరా జీడినెల్లూరు సభలో మరోసారి షాక్ ఇచ్చాడు చంద్రబాబు. నిన్న చిత్తూరులోని జీడి నెల్లూరు నియోజకవర్గంలో రా.. కదలిరా సభను నిర్వహించారు చంద్రబాబు. ఈ సభలో వ్యూహాత్మకంగా జీడినెల్లూరు అభ్యర్థిని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. థామస్ చాలా చదువుకున్న వ్యక్తి. విజ్ఞాన వంతుడు. ఆయన్ను నేనే పార్టీలోకి ఆహ్వానించాను. నియోజకవర్గ ఇన్ చార్జిగా చక్కగా పని చేస్తున్నాడు. పొత్తులో ఉన్నాం కాబట్టి పేరు ప్రకటించట్లేదు ఆనీ.. థామన్ ను ఆశీర్వదించానలి అనుకుంటున్నాను అని ఇన్ డైరెక్ట్ గా అభ్యర్థిని ప్రకటించాడు చంద్రబాబు.

దాంతో పవన్ కల్యాణ్‌ కు మరో షాక్ తగిలింది. అయినా సరే జనసేనాని పవన్ కల్యాణ్‌ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవానికి జీడినెల్లూరు టికెట్ ను పవన్ కల్యాణ్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి జనసేన తరఫున పొన్నా యుంగంధర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్నారు.

Chandrababu Shocked Pawan Kalyan In GD Nellore

Chandrababu Shocked Pawan Kalyan In GD Nellore

అయినా సరే చంద్రబాబు పవన్ ను అడగకుండానే ప్రకటించడంతో జనసేనకు మరో షాక్ ఇచ్చినట్టు అయింది. చంద్రబాబు ఇలా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా సరే పవన్ కల్యాణ్‌ మాత్రం ఏమీ చేయలేని ప్రేక్షక పాత్ర వహించాల్సి రావడం ఇక్కడ జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News