CM YS Jagan : ఈగోలేని సీఎం.. అందుకే జగన్ వెంటే నేతలు..!

Qubetvnews - February 17, 2024 / 08:22 AM IST

CM YS Jagan : ఈగోలేని సీఎం.. అందుకే జగన్ వెంటే నేతలు..!

CM YS Jagan :

జగన్ మోహన్ రెడ్డి ఎంత సహనంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ లాంటి అతిపెద్ద పార్టీకి అధినేతగా ఉంటూనే అందరినీ సమన్వయం చేయడం అంటూ పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి. ఇంత మందిని ఒప్పించి పార్టీ కోసం నడిపించాలంటే చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక జగన్ కు ఉంది కాబట్టే.. ఆయన బాటలో అందరూ నడుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు జగన్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఇందుకోసం భారీగానే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలను మార్చేశారు.

కొందరికి టికెట్లు నిరాకరించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు మార్చేశారు. ఇలా అనేక రకాల మార్పులు చేసి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలన్నది జగన్ ఆలోచన. మరి జగన్ ఇన్ని మార్పులు, చేర్పులు చేస్తుంటే టికెట్లు రాని వారు ఊరుకుంటారా.. వారి అంసతృప్తిని వారు వ్యక్తం చేస్తుంటారు కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కొంత మంది ఇప్పటికే పార్టీలు మార్చేశారు. ఇంకొందరేమో జగన్ ను బయటకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసెంబ్లీలో కొంత మంది టికెట్ రాని ఎమ్మెల్యేలతో జగన్ ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది.

ఇంకా చెప్పాలంటే టికెట్ రాకపోతే జగన్ ను విమర్శించిన ఆ ఎమ్మెల్యేలను జగన్ స్వయంగా వెళ్లి పలకరించారు. ఇందులో చూసుకుంటే కాపు రామచంద్రారెడ్డి, గున్నారపు చీఫ్‌ విప్ ప్రసాదరాజు, గుమ్మనూరు జయరాం, మల్లాది విష్ణులను స్వయంగా వెళ్లి పలకరించారు సీఎం జగన్. ఏం కాపన్నా.. కోపమా అన్నా.. ఎందుకన్నా.. నా ఛాంబర్ కు రా అన్నా మాట్లాడుకుందాం అంటూ కాపు రామచంద్రారెడ్డిని తన ఛాంబర్ కు తీసుకెళ్లారు సీఎం జగన్. అంతే కాకుండా మల్లాది విష్ణు భుజం మీద చేయివేసి స్వయంగా తన ఛాంబర్ లోకి తీసుకెళ్లారు. అక్కడ వారికి కాఫీ మర్యాద కూడా చేశారు.

కాఫీ తాగుతూ వారితో చర్చలు జరిపారు. టికెట్ రానంత మాత్రాన నిరాశ పడొద్దని.. పార్టీలో వారికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు సీఎం జగన్. అంతే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని తెలిపారు సీఎం జగన్. ఇందుకోసం ఆయన రహస్యంగా వారికి హామీలు కూడా ఇచ్చారు.

దాంతో వారు సీఎం జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. చాలా మంది నేతలు పట్టించుకోరని.. కానీ సీఎం జగన్ స్వయంగా ఇలా వచ్చి తమకు రాజకీయ పరమైన హామీలు ఇవ్వడంతో వారు ఉప్పొంగిపోయారు. ఇది కదా నిజమైన నాయకుడి లక్షణం అంటూ పొగిడేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News