Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కి పోటీగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి .. అసలు తన బ్యాక్రౌండ్ ఏంటో తెలుసా?

Qubetvnews - April 26, 2024 / 09:57 PM IST

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కి పోటీగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి .. అసలు తన బ్యాక్రౌండ్ ఏంటో తెలుసా?

Pawan Kalyan :

ఏ నియోజకవర్గంలో ఎవలు గెలుస్తారు? ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ రానుంది? ఏ పార్టీ అధికారంలోకొస్తుంది? ఎవరు సీఎం సీట్లో కూచుంటారు? ఏపీలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు. ఏ ఇద్దరు కలిసినా ఈ టాపిక్స్ పైనే మాటలు. మరోవైపు నామినేషన్ల ఘట్టం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో జోరు పెంచాయి. తాము గెలిస్తే హామీల అమలుకు ఢోకా లేదంటూ ప్రజల్లో నమ్మకాన్ని సంపాదిచుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యాయి. మెజారిటీ కోసం ఎంతటి కష్టమైనా పడడానికి రెడీ అయ్యి రెస్ట్ లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలతో తలమునకలవుతున్నారు.

మళ్లీ పవర్లోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే, ఐదేళ్లుగా కోల్పోయిన అధికారాన్ని ఈసారి పక్కా దక్కించుకోవాలని టీడీపీ కలలు కంటోంది. మరోవైపు రెబల్స్ బెడద ప్రధాన పార్టీల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పక్క పార్టీల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడంతోనే సరిపోతుంది అనుకుంటే సొంత పార్టీ నేతలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నుంచి వస్తున్న ప్రెజర్ డీల్ చేయడం మరింత తలభారంగా మారింది నేతలకి.

రెబల్స్ తాలూకు ఎఫెక్ట్ ని ఎక్కువగా ఫేస్ చేస్తోన్న పార్టీ టీడీపీనే అని చెప్పాలి. ఒకటీ, రెండు కాదు.. దాదాపు 15 స్థానాల్లో ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. దాంతో చేసేది లేక, ఓట్లు చీలడం ఇష్టం లేక వాళ్లని బుజ్జగించే పనిలో పడింది పార్టీ హై కమాండ్. కూటమి పవర్లోకొస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేస్తూ బరిలోకి తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు నేతలు. మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువమందే నామినేషన్లేశారు. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత నామినేషన్ దాఖలు చేశారు.

అయితే ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి కూడా ఉండడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుడుతు జీవనం సాగించే భాస్కర్ రావు స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయడంతో పిఠాపురంలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతని గురించి చర్చించుకుంటున్నారు. చెప్పులు కుట్టడం వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్న భాస్కర్ రావు తన దగ్గర 20 వేల రూపాయల మాత్రమే నగడు ఉందని అఫిడవిట్ లో పొందుపర్చాడు.

మూడు పార్టీలు పొత్తు కూడిన కూటమి నుంచి పవన్ లాంటి బడా సినీ స్టార్, అధికార వైసీపీ నుంచి వంగ గీత లాంటి బలమైన నేతలుండడంతో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది రాజకీయం. ఇలాంటి సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, ఆర్థికంగా ఏమాత్రం బలం లేని భాస్కర్ రావు లాంటి వ్యక్తి పోటీకి దిగడంతో సోషల్మీడియాలోనూ ఈ వార్త వైరలవుతోంది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అనీ, రాజకీయాలు పెద్ద పెద్ద పార్టీలు, నేతల సొత్తే కాదని నిరూపిస్తూ ఇలాంటి వ్యక్తులు బరిలోకి దిగినప్పుడే రుజువవుతుందటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

పెద్ద పెద్ద చదువులు చదివి, లక్షల జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు కూడా ఓటేయడానికే బద్ధకిస్తున్న ఈ రోజుల్లో నాకూ హక్కుందంటూ నామినేషన్ వేసిన భాస్కర్ రావును అభినందిస్తున్నారంతా. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన అతనికి ఎంత మాత్రం మద్ధతు దక్కుతుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News