Pawan Kalyan : పవన్ అఫిడవిట్ లో సంచలన విషయాలు.. ఎన్ని ఆస్తులో ఎన్ని అప్పులో తెలుసా..?
Qubetvnews - April 23, 2024 / 06:34 PM IST
Pawan Kalyan :
నాకంటూ ఏమీ లేదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే మార్కెట్ ఉన్నా, అన్నీ వదిలేసి ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడుతున్నాను. పార్టీని నడిపించాలి కాబట్టి అడపా దడపా సినిమాలు చేస్తున్నా గానీ.. నా కోసం కాదంటూ పవన్ ఇప్పటికే ప్రచారాల్లో చాలా సార్లు డైలాగులు దంచాడు. కానీ అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు చూస్తే మాత్రం అమ్మబాబోయ్ అనాల్సిందే. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ నామినేషన్ తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ కి అఫిడవిట్ కూడా సమర్పించారు.
ఈ అఫిడవిట్ ప్రకారం పవన్ కి హైదరాబాద్ లో 18 ఎకరాల వ్యవసాయ భూమి, ఏడెకరాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, హైదరాబాద్ లో రెండు రెసిడెన్షియల్ బిల్డింగులుండగా అందులో ఒకటి పవన్ పేరు పై, మరొకటి అన్నా లెజినోవా పేరుపై ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న మరో బిల్డింగ్ లో 50 శాతం షేర్ కొడుకు మార్క్ కి , మిగతా 50 శాతం షేర్ కూతురు పొలినాకు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు పవన్. ఇక పవన్ పేరుపై మొత్తం తొమ్మిది కార్లుండగా అందులో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అవే కాకుండా హార్లీ డేవిడ్ సన్ బైక్, ఒక పికప్ వ్యాన్ కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో వారాహి లేకపోవడం గమనార్హం.
ఇక గత ఐదేళ్లలో పవన్ ఆదాయం 114.76 కోట్ల రూపాయలు. రూ. 73.92 కోట్లు ట్యాక్స్ చెల్లించగా, జనసేనకీ మిగతా చారిటీలకి 20 కోట్ల రూపాయలు డొనేషన్స్ ఇచ్చాడనీ, రూ. 64.26 కోట్ల అప్పుందని అఫిడవిట్లో పేర్కొన్నారు పవన్. అయితే అఫిడవిట్లో కొడుకు అకిరా, కూతురు ఆద్యల పేర్లు రేణుదేశాయ్ ఇంటిపేరుతో పొందుపరిచారు పీకే.
సోషల్మీడియాలో పవన్ అఫిడవిట్ వైరలవడంతో.. ఏమీ లేవని చెప్పుకునే పవన్ కి ఇన్ని ఆస్తులెక్కడివి మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు, కట్టే ట్యాక్సులు, తిరిగే బైకులు అన్నీ తెలంగాణలో. ఎలక్షన్లప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా పోరాటం అంటూ ఏపీకి ఎంట్రీ ఇచ్చి ప్యాకేజీలు తీసుకుంటే ఎలా పవన్? అంటూ ఓపెన్ గానే సీరియసవుతున్నారు ఇంకొందరు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టే ప్రజలు పవన్ ని నమ్మడం లేదనీ, గత ఎన్నికల్లోనూ అందుకే పవన్ ని నిరాకరించారనీ పోస్టులేస్తున్నారు మరికొందరు.




