Pawan Kalyan : ఎల్లో మీడియా మైండ్ గేమ్.. పవన్ కల్యాణ్ కు భారీ షాక్..!
Qubetvnews - February 17, 2024 / 11:11 AM IST
Pawan Kalyan :
చంద్రబాబుతో పవన్ పేరుకే పొత్తులు పెట్టుకున్నారు తప్ప ఇప్పటి వరకు సీట్ల పంపకాలు లేవు.. అభ్యర్థుల ప్రకటనలు లేవు. ఇంకోవైపు జగన్ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని అన్ని విధాలుగా జగన్ సిద్ధం అయిపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా సరే ఇంకా చంద్రబాబు, పవన్ లు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. పొత్తు ధర్మాలు అంటూ పవన్ చేతులు కట్టుకుంటున్నారు. కానీ అటు వైపు చంద్రబాబు మాత్రం చేయాల్సింది అంతా చేసేసి వెళ్లిపోతున్నారు. తనకు ఏది కావాలో అది తీసేసుకుంటున్నారు.
పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి గౌరవ ప్రదమైన సీట్లు, అధికారంలో భాగస్వామ్యం అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏడు సార్లు పవన్, చంద్రబాబు భేటీ అయ్యారు. కానీ ఒక్కసారి కూడా సీట్ల పంపకాలపై ముందడుగు పడలేదు. ఇక తాజాగా ఆదివారం నాడు రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే ఇందులో ఏం మాట్లాడుకున్నారో తాజాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ ప్రధాన పత్రికలో పెద్ద కథనమే రాసుకొచ్చారు. ఎల్లో మీడియాతో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడించబోతున్నారని మనం ఇప్పటికే చెప్పుకున్నాం.
ఇప్పుడు అదే జరిగింది. ఈ కథనంలో నిజానిజాలు పక్కన పెడితే.. చంద్రబాబును పవన్ కల్యాణ్ 32 అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లు అడిగారని.. అందులో 20 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారని.. కాకపోతే ఇంకో ఐదు సీట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆ వార్తా పత్రిక ప్రధానంగా రాసుకొచ్చింది. పవన్ కల్యాణే చంద్రబాబుకు నష్టం జరగొద్దనే ఉద్దేశంతో తక్కువ సీట్లు అడిగినట్టు అందులో రాసుకొచ్చారు. ఇది చూసిన జనసైనికులు రగిలిపోతున్నారు. 60 సీట్ల కంటే తక్కువ ఇస్తే ఓట్ల బదిలీ జరగదని ఇప్పటికే కాపు ఉద్యమ నాయకులు తేల్చి చెబుతున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం తన మైండ్ గేమ్ తో ఇలా ముందే జనసేనకు తాను ఎన్ని సీట్లు ఇస్తానని హింట్ ఇస్తున్నారు. పదే పదే ఇదే విషయాన్ని తన మీడియా ద్వారా చెప్పించి దానికి జనసేనను సిద్ధం చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. కాబట్టి ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని తెలుస్తోంది.

Discussions On Between Chandrababu Pawan Kalyan Regarding candidates
కాగా ఇది తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. మరీ అంత తక్కువ సీట్ల కోసమేనా పొత్తులు పెట్టుకుంది అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు పవన్ తమకు సీటు ఇస్తాడని మురిసిపోయి పని చేసిన వారందరికీ ఇది పెద్ద షాకే. ఒక రకంగా జనసేన నుంచి నేతలు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు రాజకీయ నిపుణులు. మొత్తానికి చంద్రబాబు పద్మవ్యూహంలో ఇప్పుడు పవన్ చిక్కుకుపోయారు.




