TDP : బీజేపీతో వెళ్తే నష్టమే అంటున్న టీడీపీ.. అయోమయంలో చంద్రబాబు..!

Qubetvnews - February 18, 2024 / 01:13 PM IST

TDP : బీజేపీతో వెళ్తే నష్టమే అంటున్న టీడీపీ.. అయోమయంలో చంద్రబాబు..!

TDP :

పాపం చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టు తయారైంది. ఏ విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని కంకనం కట్టుకున్న చంద్రబాబు.. దాని కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఇప్పటికే జనసనతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ జగన్ ను ఓడించాలంటే కేవలం జనసేన బలం సరిపోదనుకున్నారు కాబోలు. అందుకే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్డీయేలో ఉన్న పవన్ కల్యాణ్‌… ఇటు చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు.

ఇక తమ జట్టులోకి బీజేపీ కూడా వచ్చి చేరాలని కోరుకుంటున్నారు పవన్ కల్యాణ్‌. ఆయన సారథ్యంలోనే చంద్రబాబు కూడా ఎన్డీయేలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. మొన్న ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారు. అయితే బీజేపీతో పొత్తుపై టీడీపీ ఏ మాత్రం కూడా సంతృప్తిగా లేదు. నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలోనే ఉంటున్నారు. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ మరిన్ని సీట్లను కోల్పోవాల్సిందే అని భయపడుతున్నారు. ఎక్కడ తమ సీట్లకు గండి పడుతుందో అని టెన్షన్ పెట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి ఎలాంటి లాభం లేదని.. బీజేపీకే లాభం అని అంటున్నారు.

అందుకే బీజేపీతో పొత్తులు అన్నా సరే టీడీపీతో నిరాశనే కనిపిస్తోంది గానీ ఎలాంటి జోష్ కనిపించట్లేదు. ఈ దీంతో ఇటు పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడితో చంద్రబాబు కూడా కాస్త ఆయోమయంలో పడ్డారు. ఎల్లో మీడియాలో అసంతృప్తిగానే ఎన్డీయేతో పొత్తుపై వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో అసలు పట్టులేని పార్టీలకు కూడా ఎన్నో కొన్ని సీట్లు వచ్చి పట్టు పెంచుకునేలా తయారైందని వాపోతున్నారు టీడీపీ నేతలు. పైగా బీజేపీతో పొత్తు అంటే ఆ పార్టీ ఎలాంటి డిమాండ్లు పెడుతుందో అనే టెన్షన్ కూడా టీడీపీలో ఉంది.

పైగా వైసీపీతో కేంద్రం ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే రాజకీయంగా టీడీపీకి లాభం చేస్తుందనే నమ్మకం లేదంటున్నారు. ఇక బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే కొన్ని వర్గాల ఓట్లను కోల్పోవడం ఖాయం అని చెబుతున్నారు టీడీపీ నేతలు.

కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా సరే బీజేపీతో పొత్తులు టీడీపీకి లాభం లేదని.. బీజేపీ, జనసేన పార్టీలకే లాభం అని గుస్సా అవుతున్నారు టీడీపీ నేతలు. ఒకవేళ బీజేపీ, జనసేన కోసం టీడీపీ కీలక సీట్లను వదిలేస్తే గనక ఆ పార్టీలో రచ్చ రచ్చే అయ్యేలా ఉంది. ఇక సీట్లు ప్రకటిస్తే అల్ల కల్లోలమే అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News