BJP : పవన్ ను కూరలో కరివేపాకులా తీసేస్తున్న బీజేపీ.. పరువు పాయే..!
Qubetvnews - February 18, 2024 / 12:52 PM IST
BJP :
పవన్ కల్యాణ్ మొదటి నుంచి తనను తానే ఏదో ఓ రాజకీయ ప్రకంపన.. ఓ సెన్సేషనల్ మ్యాన్ అన్నట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఇన్నేండ్లు అయినా సరే ఇంకా కనీసం ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదంటే ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాణ్ కు తాను ఒంటరిగా పోటీ చేస్తే ఏ మాత్రం ప్రభావం చూపించలేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఏడాదికో పార్టీతో పొత్తులు పెట్టేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎన్డీయేలో ఉన్నానని తనకు తానే చెప్పుకుంటున్నారు.
కానీ అసలు ఎన్డీయే అంటే ఏమిటి.. దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీతో పొత్తు అనే కదా. కానీ అసలు ఆ ధర్మాన్ని ఎన్నడూ కూడా పాటించలేదు. అసలు పవన్ కల్యాణ్ ను ఎన్నడూ కూడా తమ మిత్ర పార్టీగా చూడట్లేదు బీజేపీ పార్టీ. ఎందుకంటే తెలంగాణకు వచ్చే సరికి అసలు జనసేన అంటే ఎవరో తెలియదు అన్నట్టే ఉంటుంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీకి జనసేన గుర్తుకు వచ్చింది. ఓ ఎనిమిది సీట్లు పడేసి పవన్ తో తమ సీట్లలో ప్రచారం చేయించుకుంది. కానీ పవన్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని బీజేపీకి అర్థం అయిపోయింది.
పవన్ తో ప్రచారం చేయిస్తే ఏదో జరిగిపోతుందనే భ్రమలు కూడా పోయాయి. దాంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో అసలే పవన్ ను దగ్గరకు కూడా రానివ్వబోమని చెప్పేస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండవని ప్రకటించారు. బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని.. మెజార్టీ సీట్లను గెలుచుకుంటామని తెలిపారు. జనసేనతో పొత్తులు పెట్టుకుంటే ఎంపీ ఎన్నికల్లో దెబ్బ పడుతుందని బీజేపీ ప్లాన్ వేసింది. పొత్తులో భాగంగా జనసేనకు కనీసం ఒక్క సీటు అయినా కేటాయించాల్సి వస్తుంది.
కాబట్టి ఆ ఒక్క సీటు కూడా పోగొట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. అందుకే ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండబోవని ప్రకటించింది బీజేపీ పార్టీ. దీంతో ఇప్పుడు పవన్ కు బీజేపీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనీసం పవన్ ను మిత్ర పక్షంగా కూడా భావించట్లేదు.
అసలు పవన్ తో పొత్తులు పెట్టుకుంటే తమ పార్టీకే నష్టం అన్నట్టు బీజేపీ మాట్లాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు కచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో కూడా పొత్తులు పెట్టుకుంటాయి ఏ పార్టీలు అయినా. కానీ ఇప్పుడు జనసేనను పక్కకు జరిపేస్తున్నారంటే ఏ రీతిలో జనసేనను పక్కకు తప్పించేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.





