Pawan Kalyan : సీట్లొక్కటే కాదు పొత్తులో ‘పవర్’ షేరింగ్ కావాల్సిందే

Qubetvnews - February 17, 2024 / 07:22 AM IST

Pawan Kalyan : సీట్లొక్కటే కాదు పొత్తులో ‘పవర్’ షేరింగ్ కావాల్సిందే

Pawan Kalyan :

రానున్న కొద్ది రోజుల్లో ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో అందుకు కావాల్సిన పొత్తుల పై చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీల పొత్తులు సజావుగా సాగుతుంటే కొన్ని మాత్రం అడ్డంకులు కలిస్తుంటాయి. ఈ ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి రోజుకో త‌ల‌నొప్పి తలెత్తుతుంది. తాజాగా పొత్తులో భాగంగా ప‌వ‌ర్ షేరింగ్ ఉంటుందన్న ప్రచారం టీడీపీ తమ్ముళ్లలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ సారి ఎన్నికలకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు ఖ‌రార‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు అధికారికంగా ఖ‌రారైంది. అలాగే జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చాలా కాలంగా పొత్తు ఉంది. కానీ బీజేపీతో టీడీపీకి పొత్తు గురించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీతో పొత్తు లేక‌పోతే, ఇటు రాష్ట్రంలోనూ తామేమీ చేయ‌లేమ‌ని చంద్రబాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావిస్తున్నరని ప్రచారం జరుగుతోంది. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండేలా తాను మాట్లాడ్తాన‌ని ప‌వ‌న్ కళ్యాణ్ ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు. ఎట్టకేల‌కు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌న్న చంద్రబాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రయ‌త్నాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. మూడు పార్టీల మ‌ధ్య పొత్తుపై త్వరలో క్లారిటీ వ‌స్తుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇటీవ‌ల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా పొత్తు, సీట్ల పంపిణీతో పాటు అధికారంలో షేరింగ్ పై స‌రికొత్త ప్రచారం తెర‌పైకి వ‌చ్చింది. పొత్తులో భాగంగా 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు, అలాగే 10కి త‌క్కువ కాకుండా లోక్‌స‌భ స్థానాలు బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఇస్తార‌నే ప్రచారం ఇటు టీడీపీ తమ్ముళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మ‌రొక‌ వార్త వాళ్లకు పిడుగుపాటుగా మారింది. అధికారంలో కూడా జ‌న‌సేన‌, బీజేపీల‌కు భాగం ఇవ్వాల‌నే కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్‌షా త‌దిత‌ర పెద్దలు షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు పార్టీల పొత్తు కార‌ణంగా ఎక్కువ సీట్లు మిత్రప‌క్షాల‌కు ఇవ్వడాన్ని కూడా టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేకున్నారు. మ‌ళ్లీ ప‌వ‌ర్ షేరింగ్ అంటుండంతో టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాగైతే అధికారంలోకి రావ‌డం క‌లే.. ఒక వేళ అధికారంలోకి వచ్చినప్పటికీ పవర్ మన చేతుల్లో ఉండదని అని ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు నిరుత్సాహాన్ని వ్యక్త పరుస్తున్నారట.

చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా వుంటేనే ఏదైనా చేయ‌గ‌లుగుతార‌ని, ప‌వ‌న్ లేదా బీజేపీ నేత‌ల‌కు అధికారం అప్పగిస్తే మ‌ళ్లీ జ‌గ‌న్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం ఖాయమని టీడీపీ తమ్ముళ్లు వాపోతున్నారట. అస‌లెందుకు వారికి అధికారంలో భాగం ఇవ్వాల‌నే ప్రశ్న టీడీపీ నేత‌ల నుంచి వ‌స్తోంది. ఎన్నికలకు మా అంటే రెండు మూడు నెలల టైం మాత్రమే ఉండడంతో పొత్తులపై క్లారిటీనే రాలేదు. ఇంకా ప్రచారం ఎలా జరుగుతుంది.. ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తారనే ప్రశ్న విశ్లేషకుల్లో తలెత్తుతోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News