vanga geetha : పిఠాపురంలో దూసుకుపోతున్న వంగా గీత.. పవన్ కు షాక్ తప్పదా..?

Qubetvnews - March 24, 2024 / 11:52 AM IST

vanga geetha : పిఠాపురంలో దూసుకుపోతున్న వంగా గీత.. పవన్ కు షాక్ తప్పదా..?

vanga geetha : ఇప్పుడు ఏపీలో పిఠాపురం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. మరి ఏపీలో ఆయనకంటే పెద్ద లీడర్లు ఉన్నారు కదా అంటే.. జగన్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లాంటి వారు తమ పాత నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి అవి కామన్. కానీ ఇప్పుడు పవన్ మాత్రం తన పాత నియోజకవర్గాలను విడిచిపెట్టారు. గత ఎన్నికల్లో ఆయన భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగించారు.

చివరకు తన గెలుపుకు బాగా కలిసి వచ్చేది పిఠాపురమే అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ తన కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. దాదాపు 90వేలకు పైచిలుకు కాపుల ఓట్లు ఉన్నాయి. ఇంతకన్నా తన గెలుపుకు వేరే నియోజకవర్గం పనికి రాదని డిసైడ్ అయి ఇక్కడి నుంచి పోటీకి సై అన్నారు. అయితే పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. ఇక్కడి నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపారు. వంగా గీత పవన్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. పైగా ఆమె విద్యావంతురాలు, స్థానికురాలు. ఆమెకు ప్రజల్లో మంచి పట్టు కూడా ఉంది.

అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టి ఆమెకు టికెట్ ఇచ్చారు జగన్. కాగా మొన్నటి వరకు తనకు టికెట్ రాలేదని దొరబాబు అసంతృప్తితో ఉన్నారు. కానీ జగన్ తో సమావేశం తర్వాత ఆయన అలక వీడి గీత గెలుపుకోసం రంగంలోకి దిగారు. గీతను గెలిపించే బాధ్యతను దొరబాబుకు అప్పగించారు జగన్. దాంతో దొరబాబు దగ్గరుండి మరీ ప్రచార కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అటు వంగ గీత కూడా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటేస్తే.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని చెబుతున్నారు వంగ గీత.

అంతే కాకుండా పవన్ కల్యాణ్‌ ను గెలిపిస్తే ఇక్కడ ఉండడని.. కనీసం ప్రజలకు అపాయింట్ మెంట్ కూడా దొరకదని వైసీపీ నేతలు చెబుతున్నారు. పవన్ ను గెలిపిస్తే చంద్రబాబు పల్లకి మోయడమే తప్ప.. కాపులకు ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు. స్థానికంగా ఉండే వంగ గీతను గెలిపించాలని కోరుతున్నారు.

అటు కాపు అగ్ర నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో వాలిపోయారు. కాపు పెద్దలు, తమ బంధువులును ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా వంగా గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కాపు మహిళ చేతిలో పవన్ కు షాక్ తప్పదని అంటున్నారు రాజకీయ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News