Pawan Kalyan : నేరుగా ఎదుర్కనే ధైర్యం లేదా.. పవన్ ఎందుకీ సింపతీ డ్రామాలు..!

Qubetvnews - April 2, 2024 / 10:27 AM IST

Pawan Kalyan : నేరుగా ఎదుర్కనే ధైర్యం లేదా.. పవన్ ఎందుకీ సింపతీ డ్రామాలు..!

Pawan Kalyan : ఎన్నికల్లో నిలబడ్డ వారు నేరుగా వెళ్లి ఓట్లు అడగాలి. అంతకు ముందు పని చేసిన వాళ్లు అయితే ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. కొత్త వాళ్లు అయితే ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. అంతే గానీ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకం. చిన్న చిన్న డైలాగులు చెబితే ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పి.. తనకు ప్రాణహాని ఉందని చెప్పి డైలాగులు పేలిస్తే తనకు ఎక్కడ హైప్ వస్తుందో అని ఆశపడటం ఇప్పుడు పవన్ వంతు అవుతోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పవన్ ఎన్ని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు.

దాంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి గెలవకపోతే మాత్రం ఆయనకు రాజకీయ భవిష్యత్ అనేది ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకే చాలా ఆలోచించి.. తన కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ ను ఓడించేందుకు పిఠాపురంలో వంగా గీతను రంగంలోకి దింపారు జగన్. ఆమె కూడా కాపు కులానికి చెందిన మహిళానేత. అంతే కాకుండా కాపుల్లో మంచి పట్టు ఉన్న లోకల్ లీడర్. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్‌ ఆమెతో నేరుగా వెళ్తే పోటీ పడలేనని డిసైడ్ అయ్యారని వైసీపీ చెబుతోంది.

అందుకే ఇప్పుడు సింపతీ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. నిన్న పిఠాపురంలో పర్యటించినపవన్ కల్యాణ్‌.. అక్కడ మాట్లాడుతూ.. తాను పిఠాపురంలోని ఓటర్లందరినీ కలవాలని ఉందంటూ తెలిపారు. అంతేకాకుండా వారందరితో ఫొటోలు దిగాలని ఉందని చెప్పారు. కానీప్రజలు మూకుమ్మడిగా వస్తున్న సమయంలో కొందరు దుండగులు వచ్చి సన్నని బ్లేడ్ లతో తనపైన, తన సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేస్తున్నారని.. బ్లేడ్లతో కోస్తున్నారంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్‌. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్‌ మీద వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

పవన్ కల్యాణ్‌ కు దమ్ము ఉంటేనేరుగా వెళ్లి ఓట్లు అడగాలిగానీ.. ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఎందుంకటే పవన్ కల్యాణ్‌ మీద బ్లేడ్లతో దాడులు చేస్తుంటే కనీసం పట్టుకోవట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. బ్లేడ్లతో దాడులు చేస్తుంటే కనీసం కెమెరాల్లో అయినా కనిపించాలి కదా అంటున్నారు.

పవన్ కల్యాణ్‌ ఏమైనా సాధారణ వ్యక్తి కాదుకదా..ఓ పార్టీకి అధ్యక్షుడు, పెద్ద సినిమా స్టార్. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉంటుంది. అలాంటప్పుడు పవన్ కల్యాన్‌ ను ఎవరైనా టచ్ చేయగలరా.. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఏదో సింపతీ గేమ్ ఆడితేఓట్లు పడుతాయనుకోవడం భ్రమ అంటున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News