TDP : చంద్రబాబు, అచ్చెన్న చెప్పిన మాటలన్నీ ఉత్తవేనా.. టీడీపీకి అంత సీన్ లేదా..!
Qubetvnews - February 17, 2024 / 07:25 AM IST
TDP :
గప్పాలు గొట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని తన గొప్ప అని చెప్పేసుకోవడం.. తన అనునాయులతో దాన్ని పదే పదే ప్రచారం చేయించి తానే గొప్ప లీడర్ అని పొగిడించుకోవడం చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వైసీపీ ఆరోపణ. ఇందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా తనను పొగిడించుకుంటాడనుకోండి అది వేరు అంశం. కాగా చంద్రబాబు ఈ నడుమ పదే పదే ఓ అంశాన్ని చెబుతున్నారు. టీడీపీ ఈ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని.
అది కూడా టీడీపీ సింగిల్ గానే 120 సీట్లకు పైగా గెలుస్తుందని చెబుతున్నారు చంద్రబాబు. అదే విషయాన్ని అచ్చెన్నాయుడు ఇంకో అడుగు ముందుకు వేసి చెప్పేస్తున్నారు. ఈసారి టీడీపీ సింగిల్ గానే 150 సీట్లకు పైగా గెలుచుకుంటుందని పదే పదే చెప్పేస్తున్నారు. అసలు ఏపీలో అధికారంలోకి రావాలంటే 88 సీట్లు వస్తే సరిపోతుంది. మరి ఈ లెక్కన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అన్నట్టు టీడీపీకి సింగిల్ గానే అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఇంకా టీడీపీకి వేరే పార్టీలతో పొత్తు ఎందుకు అనేది వైసీపీ అడుగుతున్న ప్రశ్న.
ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చంద్రబాబుతో పొత్తులు కావాలని వెళ్లలేదు. చంద్రబాబే స్వయంగా వారిని పిలిచుకుని మరీ పొత్తులు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పునడు పవన్ ను జైలుకు పిలిపించుకుని మరీ పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలలేదనుకోండి అది వేరే అంశం. మరి చంద్రబాబు నాయుడు అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. ఇందుకోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరీ అమిత్ షాను కలిశారు.
తమతో కలిసి రావాలంటూ కోరుతున్నారు. ఎన్ని పాట్లు పడాలో అన్ని పడుతున్నారు. ఎలాగైనా మళ్లీ బీజేపీతో పొత్తు కావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడికి సింగిల్ గానే అధికారంలోకి వచ్చేంత సీన్ ఉంటే ఇంకా పొత్తులు ఎందుకు అనేది వైసీపీ వాళ్లు వేస్తున్న సెటైర్లు.
అది కూడా నిజమే కదా అంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు. ఎందుకంటే సింగిల్ గానే అధికారంలోకి వచ్చేంత సీన్ టీడీపీకి ఉంటే.. వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుని తమ పార్టీని నష్టపరచుకోవడం దేనికి. పైగా పొత్తు పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడం దేనికి.. అంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు చెబుతున్నవన్నీ తమ కార్యకర్తలను నమ్మించడానికేనా అనే సందేహాలు వస్తున్నాయి. ఒకింత ఆలోచిస్తే చంద్రబాబు, అచ్చెన్నాయుడివి డబ్బా మాటలని అంటున్నారు వైసీపీ నేతలు. ఏదో కార్యకర్తలను, జనాలను మభ్యపెట్టడానికే అలాంటి గప్పాలు కొడుతున్నారు తప్ప నిజానికి టీడీపికి అంత సీన్ లేదని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.




