Tollywood : టాలీవుడ్ లో లవ్ మ్యారేజీలు చేసుకున్న కపుల్స్ వీరే..!
Qubetvnews - February 17, 2024 / 08:39 AM IST
Tollywood :
టాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలకు కొదువే లేదు. అయితే కోలీవుడ్, బాలీవుడ్ తో పోలిస్తే మన టాలీవుడ్ లో ఈ లవ్ ఎఫైర్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక లవ్ మ్యారేజీలు మాత్రం బాగానే ఉన్నాయి. స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల దాకా చాలా మంది లవ్ మ్యారేజీలు చేసుకున్నారు. ఇందులో చాలా వరకు సక్సెస్ ఫుల్ కపుల్స్ గా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
మహేశ్-నమ్రత…
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అమ్మాయిల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా సరే ఆయన మాత్రం నమ్రతనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ వంశీ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
పవన్-రేణూ దేశాయ్…
పవన్ కల్యాణ్ కు మొదటి పెళ్లి అయిన తర్వాత రేణుదేశాయ్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ డేటింగ్ చేసి పెళ్లికి ముందే అకీరాకు జన్మనిచ్చారు. ఆ తర్వాత పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి రేణూ దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. కానీ ఇద్దరూ అనుకోకుండా విడాకులు తీసుకున్నారు.
నాగార్జున-అమల…
నాగార్జున కూడా అమలను ప్రేమ వివాహమే చేసుకున్నాడు. ఆయనకు మొదట వెంకటేశ్ చెల్లెలుతో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. కానీ అనుకోకుండా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అఖిల్ పుట్టాడు. ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
నాగచైతన్య-సమంత…
అక్కినేని నాగచైతన్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్టార్ హీరోయిన్ సమంతతో ఆయన పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. కానీ నాలుగేండ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
నాని – అంజనా యెలవర్తి…
నేచురల్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్న నాని కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. అది కూడా తన చిన్ననాటి స్నేహితురాలు అయిన అంజనా యెలవర్తిని. మొదట్లో వీరిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. కానీ అనుకోకుండా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో వారినిఒప్పించి వీరిద్దరూ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కొడుకు ఉన్నాడు.
నిఖిల్-పల్లవి…
యంగ్ హీరో నిఖిల్ సినిమాల పరంగా మంచి కంటెంట్ ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాను జాగ్రత్తగా ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఆయన పల్లవి వర్మ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ భార్య ప్రెగ్నెంట్. వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్-లావణ్య…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాల పరంగా ఇప్పుడు స్లో అయిపోయాడు. వరుసగా డిజాస్టర్లు ఇస్తున్నాడు. కానీ రీసెంట్ గానే ఆయన జీవితంలో ఓ హ్యాపీనెస్ వచ్చింది. అదేంటంటే ఆయన యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరూ పెద్దలను ఒప్పించి ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.





