Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కరెక్టుగా మూవీలు చేస్తే ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాడో తెలుసా..?

Qubetvnews - February 19, 2024 / 11:23 AM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కరెక్టుగా మూవీలు చేస్తే ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాడో తెలుసా..?

Pawan Kalyan :

పవన్ కల్యాణ్‌ కు ఉన్న రేంజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కల్యాణ్‌ కు ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా హీరోలకు కొన్ని వర్గాల్లోనే అభిమానులు ఉంటారు. కానీ పవన్ కల్యాణ్‌ కు మాత్రం అన్ని వర్గాల్లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. దాదాపు పదేండ్లు ఆయనకు ఒక్క హిట్ లేకపోయినా సరే ఆయనకు అభిమానం చెక్కు చెదరలేదంటేనే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాన్‌ ఇప్పుడు సినిమాపలై పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు.

ఎందుకంటే ఆయన అటు రాజకీయాల్లో బిజీగా గడిపేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు మధ్యమధ్యలో కొన్ని సినిమాలను కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్‌ కు ఉన్న ఫాలోయింగ్ కు, మార్కెటింగ్ కు ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఆయన ఒక్క రోజుకు కోటి నుండి రూ.2కోట్లు తీసుకుంటానని ఓ సభలో ఆయనే స్వయంగా ప్రకటించారు. దాన్ని బట్టి పవన్ కల్యాన్ ఏ రేంజ్ లో సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పనవ్ కల్యాణ్‌ ఇప్పుడు సరిగ్గా సినిమాలపై ఫోకస్ పెట్టట్లేదు గానీ.. ఆయన గనక సినిమాలు కరెక్టుగా చేస్తే కొన్ని వందల కోట్లు సంపాదిస్తారంట.

మూవీ నిపుణులు ఈ విషయాన్ని తెలుపుతున్నారు. పవన్ కల్యాణ్‌ ఓ సభలో మాట్లాడుతూ నేను గనక పాన్ ఇండియా సినిమాను చేస్తే ఏడాదిలోపే ఆ సినిమాను కంప్లీట్ చేస్తానని.. పైగా దానికి కనీసం రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు సంపాదిస్తానని గతంలో స్వయంగా చెప్పారు. ఏడాదిలోపు అంటే 200 రోజుల్లోనే ఈ మొత్తాన్ని తాను సంపాదిస్తానని పవన్ కల్యాణ్‌ చెప్పడం సంచలనంగా మారిపోయింది. వాస్తవానికి పవన్ కల్యాణ్‌ సినిమాల మీద ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇంకా ఎక్కువే సంపాదిస్తారనే టాక్ కూడా బయట చాలానే ఉంది.

Pawan Kalyan Talked About Remuneration In His Films

Pawan Kalyan Talked About Remuneration In His Films

కానీ పవన్ కల్యాణ్‌ ఎన్నడూ కూడా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. పైగా ఆయన సంపాదించిన డబ్బులు కూడా ఎక్కువగా దాన ధర్మాలు చేసేస్తుంటారు. అందుకే పవన్ కల్యాణ్‌ సంపాదన మిగతా హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ ఓజీ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలను త్వరగానే కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్‌.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News