Pawan Kalyan : నాగబాబు కోసం ఇల్లు అమ్ముకున్న పవన్ కల్యాన్‌.. ఈ విషయం తెలుసా..?

Qubetvnews - February 17, 2024 / 07:03 AM IST

Pawan Kalyan : నాగబాబు కోసం ఇల్లు అమ్ముకున్న పవన్ కల్యాన్‌.. ఈ విషయం తెలుసా..?

Pawan Kalyan :

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలదే ఇప్పుడు హవా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. పైగా నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణ్‌ గురించే. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ రేంజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నా సరే ఆయనకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ఫాలోయంగ్ పెరుగుతూనే వస్తోంది. ఇక పవన్ కల్యాణ్‌ కు డబ్బు సంపాదించడం కంటే దానం చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం అని ఆయన అభిమానులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.

ఇక తన ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పవన్ కల్యాణ్‌.. ఓ సారి తన అన్న నాగబాబు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లును కూడా అమ్మేసుకున్నారంట. ఆ విషయాలను స్వయంగా నాగబాబే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాగబాబు ఇప్పుడు జనసేన పార్టీలో పని చేస్తున్న సంగతి తెలిసిందే. అటు పవన్ కల్యాణ్‌ కూడా సినిమాల ద్వారా సంపాదిస్తున్న డబ్బులను మొత్తం పార్టీ కోసమే కష్టపెడుతున్నారని జనసైనికులు చెబుతున్నారు. అయితే ఒకసారి నాగబాబు చాలా అప్పుల్లో కూరుకుపోయారంట. నాగబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పని చేశారు.

నిర్మాతగా ఆయన కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అయితే ఓ సినిమాకు ఆయన నిర్మాతగా చేయగా అది కాస్తా దారుణంగా డిజాస్టర్ అయిందంట. ఆ సినిమాకు ఆయన అప్పులు చేసి పెడితే తీవ్రంగా నష్టపోయారు. దాంతో అప్పుడు అన్నయ్య చిరంజీవి కొంత డబ్బులు ఇచ్చినా అవి సరిపోలేదు. దాంతో పవన్ కల్యాణ్‌ కూడా తన వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేశారంట. కానీ అవి కూడా సరిపోకపోవడంతో అప్పటికే పవన్ ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇల్లును కూడా అమ్మేసి నాగబాబుకు ఇచ్చేశారంట పవన్ కల్యాణ్‌. దాంతో నాగబాబు ఆ డబ్బులతో తన అప్పులు మొత్తం కట్టేసుకున్నారు.

అలా అన్న కోసం తాను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును ఇచ్చేశారని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓ నిర్మాతకు అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంట్లో నిర్మాత కొడుకు ఉంటున్నారని తెలిపారు నాగబాబు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాగా పవన్ కల్యాణ్‌ ఇప్పుడు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కూడా చాలానే బిజీగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ కు దగ్గరలోనే ఉందంట. కానీ పవన్ మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం బాగానే కష్టపడుతున్నారు పవన్ కల్యాణ్‌.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News