Vyuham Movie : ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్ డేట్ కు.. చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా ?

Qubetvnews - February 17, 2024 / 07:44 AM IST

Vyuham Movie : ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్ డేట్ కు.. చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా ?

Vyuham Movie  :

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ త్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. చర్చనీయాంశంగా మారే సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో ఉండే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా వివాదాస్పద చిత్రాలు రూపొందుతున్నాయి. వివాదాలు లేకుండా ఆయనకు ఓ రోజు గడవదన్నట్లు బతికేస్తుంటారు ఆర్జీవీ. ఆయన దర్శకత్వం వహించిన మరో వివాదాస్పద సినిమా వ్యూహం. ఏపీ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తాజాగా తొలగిపోయాయి.

ఈ సినిమా విడుదలకు ముందే పలు వివాదాలను ఎదుర్కొంది. చాలా మంది దీనిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ మధ్య సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైనప్పటికీ వ్యూహం కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందు నిలిచి పోయింది. ఈ క్రమంలో ఆ సినిమా నిర్మాత, దర్శకుడు కూడా హైకోర్టును ఆశ్రయించి కౌంటర్ దాఖలు చేశారు. ఆ తర్వాత సినిమాను మరోసారి క్షుణ్నంగా పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు మరోసారి సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదల తేదీని ట్విట్టర్‌లో ప్రకటించిన ఆర్జీవీ..ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు లక్కీ నెంబర్ 23 అంటూ రాసుకొచ్చారు. చంద్రబాబుకు 23 సంఖ్యతో అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23 అని..2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23 అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాబు అరెస్టు అయిన తేది 9-9-23 అని..ఈ అంకెలన్ని కలిపితే వచ్చేది 23 అని రాసుకొచ్చారు. మొత్తం చంద్రబాబుకు 23 సంఖ్యతో ఉన్న 9 సందర్భాలను ట్వీట్ చేశారు ఆయన. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Vyuham Movie Release Date Of Fixed

Vyuham Movie Release Date Of Fixed

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రంలో అజ్మల్, మానస ప్రధాన పాత్రలు పోషించారు. ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ కూడా ఇతర పాత్రల్లో నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర రాజకీయాలు ఎలా మారాయి. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎప్పుడు ఏం చేశారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

 

https://twitter.com/RGVzoomin/status/1756277574899294441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1756277574899294441%7Ctwgr%5E74b283164d78020fd0581e5a56e2c13a019f13a9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.teluguglobal.com%2Fcinema-and-entertainment%2Fchandrababu-naidu-lucky-number-vyuham-movie-release-date-ram-gopal-varma-999551

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News