KCR : కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్.. సారు వద్దు బాపు ముద్దు..!

Qubetvnews - February 18, 2024 / 12:28 PM IST

KCR : కేసీఆర్ కు సరికొత్త బ్రాండింగ్.. సారు వద్దు బాపు ముద్దు..!

KCR :

రాజకీయ పార్టీల్లో కీలక నేతలకు కొన్ని బ్రాండింగ్ లు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో కామన్ గానే వస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఓ బ్రాండింగ్ ఉండేది. ఆయన్ను సారు అని పిలవడం స్టార్ట్ చేశారు. గత ఎన్నికల సమయంలో కారు, సారు సర్కారు అంటూ ప్రచారం చేశారు. అంతే కాకుండా 2019 ఎంపీ ఎన్నికల సమయంలో కూడా కారు సారు పదహారు అనే నినాదాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి మంత్రలు, ఎమ్మెల్యేలు కూడా ఇదే బ్రాండింగ్ ను బాగా ప్రమోట్ చేశారు. అయితే గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే పడింది.

కారు సారు అనే నినాదం పని చేయలేదు. అంతే కాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కారు సారు మూడోసారి సర్కారు అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా పెద్ద దెబ్బే పడింది. దాంతో ఇప్పుడు కేసీఆర్ కు ఆ బ్రాండింగ్ వర్కౌట్ కావట్లేదు. అందుకే ఇప్పుడు ఈ బ్రాండింగ్ ను మార్చాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎందుకంటే సారు అనే బ్రాండ్ తెలంగాణ ప్రజలకు పెద్దగా చేరువ కావట్లేదు. దాన్ని ప్రజలు ఓన్ చేసుకోవట్లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బాగా అలవాటు ఉన్న పేరును పెట్టేయాలని డిసైడ్ అయ్యారు.

తెలంగాణలో ఇంటి పెద్దను బాపు అని అంటారు. కాబట్టి తెలంగాణ సాధించి రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ను బాపు అనే పేరును ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికి కేసీఆర్ జన్మదినం రోజును ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే వివిధ పత్రికలు, మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ప్రకటనల్లో కేసీఆర్ ను తెలంగాణ బాపు అంటూ బ్రాండ్ ఇచ్చారు. అటు సోషల్ మీడియాల్లో పోస్టుల్లో కూడా కేసీఆర్ ను బాపు అంటూ ప్రమోట్ చేశారు. దాంతో ఈ పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బాగా చేరువ అయిపోయింది. ఒక రకంగా ఇది తెలంగాణలో బాగా వాడుకలో ఉండే పేరు.

పైగా ప్రజలకు బాగా అలవాటున్న పేరు కాబట్టి.. ఇది కేసీఆర్ కు ఇస్తే తెలంగాణ ఇంటి పెద్ద దిక్కుగా కేసీఆర్ ను చేసినట్టు అవుతుందన్నది బీఆర్ ఎస్ ప్లాన్. అందుకే ఇప్పుడు కేసీఆర్ ను ఈ బ్రాండింగ్ పేరుతో ముందుకు తెస్తున్నారు. ఈ కొత్త పేరు కేసీఆర్ కు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్వాతంత్య్రం సాధించిన గాంధీని ఎలాగైనా బాపూజీ అని పిలుస్తున్నామో.. తెలంగాణ సాధించిన క్రెడిట్ మొత్తం కేసీఆర్ కు వెళ్లే విధంగా ఆయన్ను ఇప్పుడు బాపూ అంటూ పిలవాలని బీఆర్ ఎస్ ఈ ప్లాన్ వేసింది. మొత్తానికి బీఆర్ ఎస్ వేసిన ఎత్తుగడ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఈ నినాదం ఎంపీ ఎన్నికల్లో ఏమైనా మేలు చేస్తుందేమో.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News