Revanth Reddy : బీఆర్ఎస్ నేతల నోళ్లకు సీఎం రేవంత్ తాళం!

Qubetvnews - February 28, 2024 / 04:24 PM IST

Revanth Reddy : బీఆర్ఎస్ నేతల నోళ్లకు సీఎం రేవంత్ తాళం!

Revanth Reddy :

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రెండు వారాల వ్యవధిలోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన అని నిరూపించుకుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. మరో రెండు పథకాలను నిన్న(మంగళవారం) ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్‌లో మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జన జాతర పేరుతో చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ గురించి ప్రస్తావిస్తూ.. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ తమది ప్రజా పాలన అని నిరూపించుకుంటున్నారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా గడవక ముందే ప్రజల్లో ఆయన సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. మరో వైపు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి.. ఆయన పరిపాలనను భ్రష్టుపట్టించడానికి గులాబీదళాలు బురదచల్లడం ప్రారంభించాయి. తొలి సంతకంగా ఆరు గ్యారంటీల్లో రెండింటిని రేవంత్ అమల్లోకి తెచ్చినా.. గులాబీ దళాలు పదవి కోల్పోయిన ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Revanth Reddy Participated In Public Meeting In Chevella

Revanth Reddy Participated In Public Meeting In Chevella

ఒక వైపు వందరోజుల గడువు ఇస్తాం.. ఆ తర్వాత మా తడాఖా చూపిస్తాం అని ప్రగల్భాలు పలుకుతూనే.. రెండు వారాలు గడవక ముందు నుంచే ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు ప్రారంభించారు. ఉచిత కరెంటు ఎప్పుడిస్తారు.. 500కే గ్యాస్ సిలిండర్ ఎప్పుడిస్తారు? అంటూ ఆలోచన లేకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. వారు ఒకవైపు వారు చల్లిన బురద మొత్తం నిష్ఫలం అయ్యేలా.. వారి నోళ్లకు తాళాలు వేసేశారు. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు హామీలను అమల్లోకి తీసుకువచ్చేశారు.

వాస్తవానికి కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అవసవరమైన సమయం ఇచ్చి ఉండాలి. వందరోజుల్లోగా హామీలు అమల్లోకి తెస్తాం అని రేవంత్ చెబుతూనే ఉంటున్నారు. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మూడు నెలలు టైం ఇద్దామంటూ ఆదేశించినట్టుగా గులాబీ నాయకులు అంటూ వచ్చారు. మాటలు అన్నారు కానీ.. పదవీ కాంక్షను ఆగబట్టుకోలేకపోతున్నారు. వారు అనుకున్న గడువులోగా ఎటూ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది గనుక.. అప్పుడిక రేవంత్ కొత్త పథకాలను ప్రారంభించడం సాధ్యం కాదన్న ధోరణితో నిలువెత్తు బురద చల్లే ప్రయత్నాలను తీవ్రం చేశారు. నోటిఫికేషన్ వచ్చే దాకా సాగదీసి, ఎన్నికల ఫలితాలు వెలువడేదాకా అమలు చేయకుండా కాలయాపన చేయడానికి రేవంత్ కుట్ర చేస్తున్నారని నానా మాటలూ అన్నారు.

Revanth Reddy Participated In Public Meeting In Chevella

Revanth Reddy Participated In Public Meeting In Chevella

రేవంత్ మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడంతో బీఆర్ఎస్ నాయకులను మింగుడు పడడం లేదు. ఈ రెండు పథకాలు ఇంకో రెండు నెలలు ఆలస్యం అయితే బాగుండును ప్రభుత్వాన్ని తిట్టేందుకు తమకు అవకాశం దొరుకుతుందని భావించాయి గులాబీ దళాలు.. అది ఇప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు వేరే మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఈ హామీల విషయంలో రేవంత్ వారి నోర్లకు తాళాలు వేసేసిన తర్వాత.. పాపం బురద చల్లడం వారికి ఇబ్బంది కరంగా ఉంది. ‘ఇంకా నయం.. తాము ప్రశ్నించడం వల్లనే రేవంత్ త్వరగా 500 గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు ప్రారంభించారని అంటూ సొంత డప్పు కొట్టుకుంటారేమో’ అని జనం నవ్వుకుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News