Brs wrong decision : ఆ విషయాన్ని మర్చిపోయిన బీఆర్ ఎస్.. కేసీఆర్ వెళ్లకపోవడం నష్టమేనా..?
Qubetvnews - March 2, 2024 / 09:31 AM IST
Brs wrong decision : బీఆర్ ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే బీఆర్ ఎస్ అనేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది ఆ పార్టీ. ఎందుకంటే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయినా సరే మీరు ఎవరికి ఓట్లేస్తున్నారు అంటే కేసీఆఆర్ కు అనేంతగా ఇమేజ్ పెరిగింది. అంతగా కేసీఆర్ పేరు ప్రజలకు పరిచయం ఉంది. కాబట్టి ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ ముందు ఉంటే ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. ఆ విషయం బీఆర్ ఎస్ కు కూడా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ పదేండ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, బీఆర్ ఎస్ ఎల్పీ నేతగా కూడా ఉన్నారు.
కాబట్టి కేసీఆర్ కు ఉన్నంత ఇమేజ్ కేటీఆర్ కు ఉండదనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాలేశ్వరం విషయంలో పెద్ద రచ్చే చేస్తోంది. మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి పెద్ద ఎత్తున అవకతవకలపై మాట్లాడారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా అసెంబ్లీలో చర్చ పెట్టి రచ్చ చేశారు. ఇంత చేసిన తర్వాత తాము కూడా మేడిగడ్డకు వెళ్లి ప్రజలకు నిజాలు వివరిస్తాం అని బీఆర్ ఎస్ తలచింది. ఈ విషయాన్ని నల్గొండ సభలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే మేడిగడ్డకు కేసీఆర్ నేతృత్వంలోనే వెళ్తారని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా నిన్న కేటీఆర్ ఆధ్వర్యంలో మేడిగడ్డకు వెళ్లారు. కేసీఆర్ వెళ్లలేదు. పైగా హరీశ్ రావు కూడా కనిపించలేదు. దాంతో ఈ పర్యటనకు పెద్దగా క్రేజ్ రాలేదు. కేసీఆర్ వచ్చి ఉంటే కచ్చితంగా అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా హైలెట్ అయి ఉండేది. అంతే కాకుండా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించేది. కానీ కేసీఆర్ వెళ్లకపోవడం వల్ల ఆ పర్యటనకు కాంగ్రెస్ పర్యటనకు వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పుకోవాలి. దాంతో ఇప్పుడు ఈ విషయంలో బీఆర్ ఎస్ అప్సెట్ అవుతోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ ఓ విషయం మర్చిపోయినట్టు ఉంది.
కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లారు. అంతే కాకుండా తెలంగాణ భవన్ కు కూడా వచ్చారు. అలాంటప్పుడు తాను పదేండ్లు కష్టపడి కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టే బాధ్యత కేసీఆర్ మీద ఉంది. ఎందుకంటే ఆయనకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టుపై ఇలాంటి ప్రచారం ఆయన ఇమేజ్ ను దెబ్బ తీస్తోంది.
కాబట్టి కేసీఆర్ ఇక్కడకు వెళ్లి మీడియాతో మాట్లాడి ఉంటే మాత్రం క్రేజ్ వేరే లెవల్ లో ఉండేది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం వచ్చేది. కానీ ఈ విషయాన్ని బీఆర్ ఎస్ మర్చిపోయింది. అసలు కాళేశ్వరాన్ని కట్టించాననే పేరు ఉన్న కేసీఆర్ వెళ్లకపోతే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది అనే విషయాన్ని బీఆర్ ఎస్ ఎందుకు మర్చిపోయిందో అర్థం కావట్లేదని అంటున్నాయి రాజకీయ వర్గాలు.





