Revanth Reddy strategy for mp elections : పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహం.. అదే ప్రచార ఆయుధమా..?
Qubetvnews - March 2, 2024 / 09:04 AM IST
Revanth Reddy strategy for mp elections : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నిమమించింది. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించి తన గ్రాఫ్ ను కాపాడుకునేందుకు ఆయన కొత్త వ్యూహాలకు తెర తీస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఆయన సీఎం అయినప్పటి నుంచి కేవలం బీఆర్ ఎస్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడా కూడా బీజేపీ తెలంగాణ నాయకుల గురించి మాట్లాడట్లేదు.
ఎందుకంటే బీజేపీ గురించి రేవంత్ మాట్లాడితే ఆయనకు వారి నుంచి పోటీ తప్పదని భావిస్తున్నారు. ఎంత లేదన్నా ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కూడా ఉండబోతోంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కాబట్టి జాతీయ పార్టీ అయిన బీజేపీ హవా ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని సైడ్ చేసి పోటీ కేవలం కాంగ్రెస్ కు బీఆర్ ఎస్ కు మధ్యనే అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ఎంచుకున్నారు. బీఆర్ ఎస్ తన పదేండ్ల పాలనలో గొప్పగా చెప్పుకుంటున్నది కాళేశ్వరం ప్రాజెక్టు.
అయితే ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా ఇందులో చాలా అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు అసలు దాని వల్ల ఎన్ని ఎకరాలకు నీరు అందింది అనేది కూడా ఆయన వివరించి చూపించారు. అంతే కాకుండా మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి కాబట్టి.. వాటిని హైలెట్ చేసి మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిలో దానిపై చర్చ జరిగే విధంగా చేయడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఇదే విషయంపై టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ ఎస్ కు చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేకుండా చేయాలనేది ఆయన వ్యూహం. అప్పుడు ప్రజల దృష్టిలో ఆటోమేటిక్ గా కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదనే ఆలోచన మొదలవుతుంది.
అప్పుడు బీఆర్ ఎస్ ఇరకాటంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా బీఆర్ ఎస్ బూచిగా చూపించి ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం అనే అంటున్నారు. చూడాలి మరి ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఈ విషయాన్ని ఎలా ఎదుర్కుంటుందో.




