Etela Rajender : కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతుంది : ఈటెల
Qubetvnews - April 30, 2024 / 08:32 AM IST
Etela Rajender :
మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నేడు నారాపల్లి కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం, చెంగిచర్ల లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్, నాగోల్ శుభం గార్డెన్స్ లో నిర్వహించిన విద్యా సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి నిజాం పేటలో రోడ్డు షో లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకర్షించాడు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్లు క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్నా ఓట్లు వేసి, గెలిపించారు. కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడడానికి గానీ, వారి సమస్యలు తెలుసుకోవడానికి గానీ ఆయన ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు.
మరి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ మాత్రం లాభం లేదు. తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు, ఐటీ అభివృద్ధి, రోడ్లు, కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యం. నేను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి వద్దకు వెళ్లి ఈ ప్రాంతంలోని సమస్యల పై చర్చించగలను. మీరందరూ విజ్ఞులు, బాగా ఆలోచించి మీ ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన అన్నారు.

JP Nadda Etela Rajender Participated In Road Show At Nizampet
మహిళలకు ఆర్థిక భద్రత, ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడానికి మన మోదీ సదా సిద్ధం. అందుకే స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత కల్పించి, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం మన మోదీ గ్యారంటీ. ఒక్క ఓటు… 500 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రామ మందిర నిర్మాణాన్ని సాకారం చేసింది. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఇదంతా కేవలం ప్రజా బలమే. ప్రజాభీష్టాలను నెరవేర్చడానికి ప్రజల ఓటు బలాన్ని నమ్ముకున్నారు మన మోదీ. అందుకే మరోసారి మన మోదీ సర్కార్. మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ అన్నారు.





