Kasani Gnaneshwar : కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలి : కాసాని జ్ఞానేశ్వర్
Qubetvnews - April 25, 2024 / 10:00 AM IST
Kasani Gnaneshwar :
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. తన ప్రత్యర్థులతో పోల్చితే ప్రచారం విషయంలో కాసాని ముందున్నారు. ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు రోడ్డు షో లు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో కాసాని ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాసాని వెంట ఉన్నారు. ప్రచారంలో భాగంగా కాసాని మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు బుద్ది చెప్పబోతున్నారు అంటూ హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ఎలా అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ కి అండగా నిలిచారో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటర్లు కారుకు సారుకు మద్దతుగా నిలుస్తారు అంటూ కాసాని ధీమాతో ఉన్నారు. ప్రచారం లో ముందుకు సాగుతున్న కాసానికి అనేక సమస్యలను ప్రజలు నివేదిస్తున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆరు నెలల్లోనే అయిదు ఏళ్ల వ్యతిరేకత మూట కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంను ఇంకా జనాలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు బీఆర్‌ఎస్ కు దక్కడం ఖాయం అంటూ కాసాని జ్ఞానేశ్వర్ వ్యాఖ్యలు చేశారు. విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్న కాసాని గెలుపు ఖాయం అంటూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ధీమాతో ఉన్నారు.





