Kishan Reddy : మిడిమిడి జ్ఞానంతో రేవంత్ ఆరోపణలు : కిషన్ రెడ్డి

Qubetvnews - May 11, 2024 / 10:03 AM IST

Kishan Reddy  : మిడిమిడి జ్ఞానంతో రేవంత్ ఆరోపణలు : కిషన్ రెడ్డి

Kishan Reddy :

తెలంగాణకు గడచిన 10 ఏళ్లలో రూ.9 లక్షల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ది చేస్తే కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిందే లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు అంటూ కిషన్ రెడ్డి అన్నారు. వారు నెత్తిన గాడిద గుడ్డు పెట్టుకుని తిరుగుతూ వారి పార్టీ గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ గాడిద గుడ్డు ప్రచారంకు ప్రజలు తగిన సమాధానం చెప్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అవివేకం బయట పడుతుందని, తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వబోతున్న షాక్‌ కి మైండ్‌ బ్లాంక్ అవ్వడం ఖాయం అంటూ కిషన్ రెడ్డి హెచ్చరించారు.

దుర్మార్గమైన కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ లు సత్తా లేక, ఈ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్‌ ల విషయంలో బీజేపీ పై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ఖచ్చితంగా న్యాయపరమైన శిక్ష లు తప్పవు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రాజ్యాంగంను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం. కనుక అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తూ ఉన్నారు. బీజేపీ దేశ అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తున్నారు. మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం, ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు దగ్గర ఉండి చూడటం కూడా ఖాయం అంటూ కిషన్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ కి ప్రధాని అయ్యే అర్హత లేదని, ఈ దేశం సుబిక్షంగా, క్షేమంగా ఉండాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలి, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం ఉండబోదని, రాహుల్‌ మరియు మోడీల మధ్యే ఎన్నికలు. కనుక మంచి ప్రధానిగా పేరు దక్కించుకున్న మోడీ కే ఓటు వేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

విమర్శించడానికి ఏమీ లేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని భావించి.. రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగబోతుంది. కనుక ఈ ఎన్నికల్లో యువత తో పాటు అన్ని వర్గాల వారు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఓటింగ్ శాతం పెంచేందుకు, యువత ముందుకు వచ్చి ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించాలంటూ యువత తో జరిగిన మీటింగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News