Kishan Reddy : ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మాకు ఎలాంటి ఢోకా లేదు : కిషన్ రెడ్డి

Qubetvnews - May 10, 2024 / 09:32 AM IST

Kishan Reddy  : ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మాకు ఎలాంటి ఢోకా లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddy  :

అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి మరియు తనకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించిన కిషన్ రెడ్డి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, బట్టకాల్సి మా మీద వేసిన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గాడిద గుడ్డు ప్రచారం కేవలం కాంగ్రెస్ కి మాత్రమే పరిమితం అవుతుంది. రాబోయే రోజుల్లో గాడిద గుడ్డు వారి పార్టీ గుర్తు అవుతుంది అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. హై కమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలిశాం, అన్ని చోట్ల కూడా బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉంది అన్నారు.

కాంగ్రెస్ కి మమ్ములను విమర్శించడానికి ఎలాంటి పాయింట్‌ లేదు. అందుకే రిజర్వేషన్ల విషయమై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణలోనే కాకుండా దేశం వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదని, వారి మాటలను.. వారి గ్యారెంటీలను హామీలను ప్రజలు నమ్మే రోజులు కావని కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను తొలగించే ఉద్దేశంతో ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు త్వరలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు ఓటర్లు తమ ఓటుతో తగిన గుణపాఠం చెప్తారంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం చేశారు.

Kishan Reddy Said Congress And BRS Party False Allegations Against BJP

Kishan Reddy Said Congress And BRS Party False Allegations Against BJP

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా జనాలు పట్టించుకోరని, ఆయనను జనాలు పక్కన పెట్టారని అన్నారు. ఎన్నికలు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ఉంటాయని బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అది చెల్లని ఓటుగా మిగిలి పోతుంది అంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy Said Congress And BRS Party False Allegations Against BJP

Kishan Reddy Said Congress And BRS Party False Allegations Against BJP

దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసే స్థాయికి ప్రధాని మోడీ మన దేశాన్ని తీసుకు వెళ్లారు అంటూ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి ప్రధాని భారతదేశానికి అవసరం. కనుక మూడోసారి మోడీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది అంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News