Kishan Reddy : బై మిస్టేక్‌గా రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాడు : కిషన్ రెడ్డి

Qubetvnews - May 9, 2024 / 09:30 AM IST

Kishan Reddy : బై మిస్టేక్‌గా రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాడు : కిషన్ రెడ్డి

Kishan Reddy :

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలు, సమావేశాలకు హాజరు అయ్యారు. అంతే కాకుండా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. రేవంత్‌ రెడ్డి బై మిస్టేక్ గా సీఎం అయ్యాడు అంతే తప్ప అతడు ఏదో పొడిచాడు అని కాదు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోతాము అనే భయంతో రేవంత్ రెడ్డి బీజేపీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గాడిద అసలు గుడ్డు పెట్టడు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గాడిదతో గుడ్డు పెట్టించి ఈ భూమి మీద ఎక్కడ జరగని పనిని రేవంత్ రెడ్డి సాధ్యం అయ్యేలా చేశారు అంటూ ఎద్దేవ చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… రాజ్యాంగం ద్వారా అంబేద్కర్‌ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు. అలాంటి ఆలోచనను మోడీ ప్రభుత్వం ఎప్పటికి చేయదు. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఓటర్లు తమ ఓటుతో తిప్పి కొడతారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారం దక్కించుకున్న రేవంత్‌ రెడ్డి ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలను చెప్పి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఓటర్లు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌ పై కోపంతో మాత్రమే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేసి అధికారంను కట్టబెట్టారు. అంతే తప్ప వారు ఏదో మేలు చేస్తారని కాదు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్తేనే ముందు ముందు అయినా ఇచ్చిన హామీల విషయంలో శ్రద్ద కనబర్చుతారు. రేవంత్‌ రెడ్డి తన పార్టీ గుర్తు కంటే కూడా ఎక్కువగా గాడిద గుడ్డును చూపిస్తున్నారు. ముందు ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు గాడిద గుడ్డు అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అంటూ రేవంత్‌ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారం పై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లుగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మతాల వారిగా రిజర్వేషన్లు ఇస్తూ బీసీ మరియు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్‌ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం మతాల వారిగా ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో అస్సలు అంగీకారం తెలుపదు అన్నారు. బీజేపీతోనే దేశం అభివృద్ది మరియు సంక్షేమం సాధ్యం అన్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News