Ktr : ఆ విధంగా బీఆర్ ఎస్ లీడర్లను భయంలో ఉంచుతున్న కేటీఆర్.. లైన్ దాటకుండా..!
Qubetvnews - March 31, 2024 / 09:42 AM IST
Ktr : ఎవరు ఏమన్నా ఇప్పుడు బీఆర్ ఎస్ కు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ కు ఇలాంటి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అటు భూ కబ్జా కేసులు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్టీని కుదిపేస్తున్నాయి. దాంతో పాటు అటు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం పార్టీకి అతిపెద్ద దెబ్బ పడింది. ఇవి సరిపోదు అన్నట్టు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంతో కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవాలి. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.
ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు పార్టీని అందరూ వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పార్టీకి చాలామంది దూరం అయిపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు వెళ్లిపోతున్నారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కు రోజురో షాక్ తగులుతోంది. ఎంపీ టికెట్లు వద్దనుకుని మరీ సిట్టింగ్ ఎంపీలు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది దూరం అయిపోయారు. దానికి తోడు ఇప్పుడు కే.కేశవరావు, ఆయన కూతురు, కడియం శ్రీహరి కుటుంబం కూడా ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతోంది. దాంతో ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. వెళ్లిపోతున్న వారిని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
బుజ్జగింపులతో పని కావట్లేదని కేటీఆర్ గ్రహించారు కాబోలు. అందుకే ఆయన తాజాగా ఓ ప్రకటన చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిపోతున్న వారిని గుర్తుంచుకుంటాం. రేపు పొద్దున మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు వెళ్లిపోతున్న వారు అప్పుడు మళ్లీ పార్టీలోకి రావాలనుకున్నా రానివ్వం.. కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా సరే వారిని రానిచ్చే పరిస్థితులు ఉండవు అంటూ హెచ్చరిస్తున్నారు కేటీఆర్. అంటే ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉందని వెళ్లిపోతున్న వారు.. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తామన్నా సరే రానివ్వమని ఆయన చెబుతున్నారన్నమాట.
ఇలాంటి హెచ్చరికల వల్ల ఎంతో కొంత నష్టాన్ని ఆపొచ్చు అన్నది కేటీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. బుజ్జగింపులతో పని కాదని తెలిసినప్పుడు.. హెచ్చరికలతోనే సాధ్యం అని కేటీఆర్ భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిపోవాలని అనుకుంటున్న వారికి ఇలా హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్ ఎస్ లోకల్ పార్టీ. ఎప్పటికైనా కేసీఆర్ ఫ్యామిలీదే పెత్తనం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు పార్టీలోకి రావాలన్నా సరే వారి అనుగ్రహం ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు వెళ్లిపోతే రానివ్వమని చెప్పేసి.. వెళ్లిపోవాలని అనుకున్న వారికి ఇలా అడ్డుకట్ట వేస్తున్నారు కేటీఆర్.


