KCR : ఆ పొరపాటే కేసీఆర్ కొంప ముంచిందా..?

Qubetvnews - March 29, 2024 / 09:53 AM IST

KCR : ఆ పొరపాటే కేసీఆర్ కొంప ముంచిందా..?

KCR : రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితులు ఉండవు. గెలుపు, ఓటములు అనేవి చాలా సహజం. అయితే ఒక పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తన ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న ప్రతిష్ట అనేది ఎప్పుడూ దెబ్బ తినకుండా చూసుకోవాలి. అదే చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ప్రజల్లో ఆదరణ ఉంటుంది. కానీ ఒక పార్టీని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితులు అయితే తెచ్చుకోవద్దు. సొంత పార్టీ నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోతుంటే కచ్చితంగా ఎదురు బెబ్బలు తగిలినట్టే.

ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి. గత పదేండ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించారు కేసీఆర్. పదేండ్లు సీఎంగా తన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ ఎస్ పతనావస్థ మొదలైందని అంటున్నారు. ఎందుకంటే వరుసగా బీఆర్ ఎస్ మీద అవినీతి ఆరోపణలు, కేసులు పార్టీ ప్రతిష్టను దిగజార్చతున్నాయి. దాంతో పాటు బీఆర్ ఎస్ లీడర్లు అందరూ పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు అయితే టికెట్లు ఇస్తామన్నా సరే వద్దని వెళ్లిపోతున్నారు.

ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టికెట్లు రాని వారు ఇప్పటికే పార్టీని వీడారు. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అటు కడియం కావ్య, శ్రీహరి ఎంపీ టికెట్ వద్దని మరీ వెళ్లిపోతున్నారు. దాంతో పాటు కేసీఆర్ కు నీడలాగా ఉండే కే.కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు. ఇలా వరుసగా కేసీఆర్ సన్నిహితంగా ఉండేవారే వెళ్లిపోతున్నారు. కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండేవారే వెళ్లిపోతున్నారంటే.. ఇక కేసీఆర్ తో పెద్దగా సత్సంబంధాలు లేని ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు.

వారు కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ కు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే.. ఆయనచేసిన పొరపాటే అంటున్నారు. కేసీఆర్ గత పదేండ్లుగా ఇతర పార్టీల నేతలను తన పార్టీలో చేర్చుకుని నాయకులు ఉన్నారని చెప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచే ఎక్కువ మందిని చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చుకున్నారు.

అంతే గానీ సొంతంగా నాయకులను తయారుచేసుకోలేకపోయారు. బీఆర్ ఎస్ లో సొంతంగా ఎదిగిన లీడర్లు చాలాతక్కువ మందే ఉంటారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మొత్తానికి కేసీఆర్ చేజేతులారా చేసుకున్న పొరపాటే ఆయన కొంప ముంచిందని అంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News