Patnam Sunitha Mahender Reddy : కాంగ్రెస్ తోనే అభివృద్ది, సంక్షేమం : సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 8, 2024 / 10:16 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విరామం లేకుండా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. మంగళవారం సునీత మహేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా… హయత్ నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు, మన్సూరాబాద్ డివిజన్ లోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఆటోనగర్ లారీ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.
సరూర్‌నగర్ లోని నమిత ఎవరెస్ట్ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించండి అన్నారు. వనస్థలిపురం లోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయం లో దర్శనం చేసుకొని, అనంతరం అదే గుడి లోపల ఉన్న అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Patnam Sunitha Mahender Reddy At Teachers Association Meeting In Saroornagar
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించండి అంటూ పలు ప్రజా సంఘాల నాయకులతో మరియు పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో సునీత మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్‍సుఖ్‍నగర్ P&T కాలనీ లోని SS ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గడ్డి అన్నారం డివిజన్ మహిళా నాయకుల సమావేశం లో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను మల్కాజ్గిరి ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలిపించండి అని కోరారు. ఎక్కడ ర్యాలీ నిర్వహించినా ఒకటే ఫలితం. మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, ఆప్యాయతకి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించిన రెట్టింపు ఉత్సహంతో రానున్న ఎన్నికల్లో మన కాంగ్రెస్ శ్రేణులు మరోసారి మన సత్తా ఏంటో చూపిద్దాం అన్నారు. కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, మసీద్ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం రాత్రి ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వీటీ బష్టాండ్ వరకు నిర్వహించిన రోడ్ షో కార్యక్రమం భారీ విజయవంతం కావడంపై సునీత హర్షం వ్యక్తం చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రచారంలో మాట్లాడి ఓటర్ మహాశయులలో కొత్త ఉత్సహం నింపినందుకు నేను కృతజ్ఞురాలిని. ఈ కార్యక్రమ ఇంతటి భారీ విజయవంతం అయ్యేందుకు కృషి చేసి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే ఉత్సహంతో అందరం కలిసికట్టుగా కష్టపడి రానున్న ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిద్దాం. కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యం, కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి అని ఆమె అన్నారు.





