Patnam Sunitha Mahender Reddy : కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం : పట్నం సునీత మహేందర్ రెడ్డి
Qubetvnews - May 6, 2024 / 10:25 AM IST
Patnam Sunitha Mahender Reddy :
మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెమ్మెంట్లలో ఆదివారం పర్యటించారు. ఆ సమయంలో పలు చర్చిల్లోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ది కొనసాగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటూ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇంకా పలు సభలు సమావేశాల్లో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం, నాచారం లోని హోసన్న చర్చి లో జరిగిన ప్రార్ధన కార్యక్రమం లో పాల్గొనటం జరిగింది. శామీర్ పేట లోని మూడు చింతలపల్లి మండలం లోని మూడు చింతలపల్లి గ్రామం లో నిర్వహించిన ప్రచారం మరియు రోడ్ షో లో పాల్గొనడం జరిగింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రాంత ప్రజల యొక్క పూర్తి మద్దతు రానున్న ఎన్నికల్లో నాకు తోడుగా ఉండాలని కోరటం జరిగింది.

Patnam Sunitha Mahender Reddy Campaign In Chintalapalli Village
మేడ్చల్ లోని శ్రీనివాస్ గార్డెన్స్ లో నిర్వహించిన బి. సి ఐక్యత సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీ తో గెలిపించండి అని కోరడం జరిగింది. ఈరోజు ఉదయం మరియా రోసా మైస్టిక చర్చి లో జరిపిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఆ ప్రభువు దీవెనలు ఎల్లవేళలా మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
నాచారం లోని హోసన్న చర్చి లో జరిగిన ప్రార్ధన కార్యక్రమం లో అనుముల కొండల్ రెడ్డి గారు,ఏఐసీసీ వైస్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి గారు , DCC అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు , రాంమోహన్ గౌడ్ గారు , జక్కంపూడి ప్రభాకర్ రెడ్డి గారు , ఉప్పల్ ఇంచార్జీ పరమేశ్వర రెడ్డి గారు , సినీరంగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

Patnam Sunitha Mahender Reddy Campaign In Chintalapalli Village
మేడ్చల్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహిళా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనటం జరిగింది. ఒక మహిళా నాయకురాలిగా, మహిళల ప్రతి సమస్యపై నా గళం పార్లమెంటులో వినిపించి మహిళా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మీరు అందరూ ఎల్లవేళలా నాతో ఉంటారన్న ధైర్యమే నన్ను ఇంత దూరం తీసుకు వచ్చింది. నా గెలుపు వరకు నాకు తోడుగా నిలుస్తాయారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.





